
Outfit Elevation Design Ideas: వేడుకల సందర్భాల్లో ధరించే సంప్రదాయ దుస్తులకు ఎంబ్రాయిడరీ చేయించడం చూస్తూనే ఉంటాం. వాటి తయారీ కోసం కొన్ని రోజుల వరకు ఎదురుచూడటం ఖర్చు ఎక్కువ అవుతుందనుకోవడం కూడా వింటుంటాం.
వీటి స్థానంలో మార్కెట్లో లభించే వివిధ రకాల డిజైనరీ పట్టీలు విస్తృతంగా వచ్చి చేరాయి. ఈ ఎంబ్రాయిడరీ స్ట్రిప్స్‌తో డ్రెస్ స్టైల్‌లో వచ్చిన మార్పులు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి.
ఇతర అలంకారాలకూ....
బ్యాగ్, బ్యాంగిల్స్, నడుముకు ధరించే బెల్ట్... ఇలాంటి వాటిని కూడా అందమైన ఎంబ్రాయిడరీ పట్టీలను ఉపయోగిస్తూ తమ స్టైల్‌ని మరింత ఆకర్షణీయంగా మార్చేస్తున్నారు. ఇందుకు చేయాల్సిందల్లా మ్యాచింగ్ స్ట్రిప్స్‌ని ఎంచుకోవడమే. అందుకు ఎలాగూ అవకాశం ఉంది కదా!
కాటన్, సిల్క్, డెనిమ్... ఫ్యాబ్రిక్ ఏదైనా, ఇండో వెస్ట్రన్ స్టైల్‌కి తీసుకురావచ్చు. సంప్రదాయ ఎంబ్రాయిడరీ స్ట్రిప్స్ ఎంచుకుంటే వాటిని కుర్తీ, లెహంగా, శారీ డిజైన్స్‌కు వాడచ్చు. అదే, వెస్ట్రన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నవి లేదా మన ఇతర ప్రాచీన ఎంబ్రాయిడరీ కళతో ఉన్న స్ట్రిప్స్‌ని మోడర్న్ డ్రెస్ డిజైన్స్‌లో ఉపయోగించవచ్చు.
చదవండి: Fashion Trends: వేడుకలో మరింత వెలిగిపోయేలా..
Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే!