Fashion: వేడుకల వేళ.. కాటన్‌ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ!

Fashion: Cotton Trendy Outfits For Rainy Season - Sakshi

వేడుకల వేళ.. కాటన్‌ కళ

రాబోయేది పండగల సీజన్‌. సంప్రదాయ చీర కట్టులో భాగంగా వేడుకలో పట్టుకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. సౌత్‌ ఇండియన్‌ కాటన్స్‌తో సౌకర్యంగానూ, పండగ కళ పెంచేలా డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు. 

మనవైన కాటన్స్‌ తలపునకు రాగానే ప్రముఖంగా మంగళగిరి, నారాయణ్‌ పేట్, పోచంపల్లి, గద్వాల, ఉప్పాడ, కలంకారీ.. వంటివి కళ్ల ముందు నిలుస్తాయి. అయితే, కాటన్‌ అనగానే చాలామంది ఈ సీజన్‌కి సరైనవి కావు అనుకుంటారు.

కానీ, ఏ కాలమైనా మనవైన కాటన్స్‌ జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ ఉంటాయి. వాటిలో పండగల కాలంలో పట్టు కట్టకపోయినా ఏ మాత్రం వన్నె తగ్గని జరీ అంచు కాటన్‌ వినూత్నమైన కళను తీసుకువస్తాయి. వాటిలో చీరకట్టు మాత్రమే కాదు సౌకర్యంగా ఉండే కుర్తా సెట్, లాంగ్‌ అండ్‌ షార్ట్‌ గౌన్స్‌ కూడా ధరించవచ్చు. 

క్యాజువల్‌గానూ అదే విధంగా పార్టీవేర్‌గానూ ఎంపిక చేసుకోవచ్చు. అయితే, వీటిని రెడీమేడ్‌గా కాకుండా ఎవరికి తగినట్టుగా వారు డిజైన్‌ చేసుకోవచ్చు.
సరైన డ్రెస్‌ అందుబాటులో లేదనుకుంటే మనదైన సంప్రదాయ జరీ అంచు కాటన్‌ దుపట్టా ధరించినా చాలు పండగ కళ వచ్చేస్తుంది. 
వీటికి సంప్రదాయ ఆభరణాలు లేదా టెర్రకోట, ఫ్యాబ్రిక్, సిల్వర్‌ జ్యువెల్రీ కూడా పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అవుతాయి. ఆభరణాల ఊసు లేకపోయినా అందంగానూ ఉంటాయి. 

చదవండి: Bindu Madhavi: ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top