Beauty Tips: దీనిని వాడితే డబుల్‌ చిన్‌ మాయం! | Facial Slimming Massager Can Use To Get Rid Of Double Chin | Sakshi
Sakshi News home page

Beauty Tips In Telugu: ఇలా చేస్తే డబుల్‌ చిన్‌ మాయం.. అందం రెట్టింపు!

Sep 19 2021 11:32 AM | Updated on Sep 19 2021 11:47 AM

Facial Slimming  Massager Can Use To Get Rid Of Double Chin - Sakshi

వారానికో ఫేస్‌ మాస్క్‌.. రోజుకో వైటెనింగ్‌ క్రీమ్‌.. పూటకో ఫేస్‌వాష్‌ మార్చి.. నచ్చినవిధంగా ముఖవర్చస్సును సొంతం చేసుకోవచ్చు కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా షేప్‌లెస్‌గా మారిన ముఖాకృతిని సెట్‌ చెయ్యడం కష్టమే. అలాంటి సమస్యకు చెక్‌ పెట్టేస్తుందీ చిత్రంలోని ఫేషియల్‌ స్లిమ్మింగ్‌ మసాజర్‌. ఇది డబుల్‌ చిన్‌ తొలగించి.. ముఖానికి "V" షేప్‌ లుక్‌ తీసుకొస్తుంది. అందంతో పాటు ఆరోగ్యాన్నీ సంరక్షిస్తుంది. దీనిలోని బయోనిక్‌ మైక్రో–కరెంట్‌ స్టిమ్యులేషన్‌ టెక్నాలజీ.. కండరాలను ఉత్తేజపరుస్తుంది. ఈ డివైజ్‌ 180 డిగ్రీస్‌ ఫోల్డింగ్‌ రింగ్‌ డిజైన్‌ కావడంతో ఇంట్లోనే కాదు ట్రావెలింగ్‌ సమయంలో కూడా సులభంగా ఉపయోగింకోవచ్చు.

అప్‌గ్రేడ్‌ వెర్షన్‌తో రూపొందిన ఈ ఫేస్‌ లిఫ్టింగ్‌ మసాజర్‌ని.. రెండు దవడల చుట్టు నొక్కినట్లుగా, గడ్డం కింద నుంచి అడ్జెస్ట్‌ చేసుకోవాలి. ఆటోమేటిక్‌ మోడ్, మసాజ్‌ మోడ్, ఆక్యుపంక్చర్‌ మోడ్, బీటింగ్‌ మోడ్‌ వంటి 6 మోడ్స్‌ కలిగిన ఈ డివైజ్‌తో పాటు.. ప్రత్యేకమైన 4 మసాజ్‌ హెడ్స్‌ (2 వేరు వేరు జతలు) లభిస్తాయి. ఈ డివైజ్‌ ఫ్రీక్వెన్సీ మాగ్నెటిక్‌ థెరపీ, ఫిజియోథెరపీలను సమర్థవంతంగా అందిస్తూ.. మైక్రో కరెంట్‌ సెల్స్‌ని మెరుగుపరుస్తుంది. దాంతో ముఖ కండరాల కదలికలను యాక్టివేట్‌ చేస్తుంది. రక్త ప్రసరణలో వేగాన్ని పెంచి, మెడ కింద భాగంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి.. ముఖానికి పర్ఫెక్ట్‌ లుక్‌ అందిస్తుంది. 

మసాజ్‌ హెడ్స్‌కి, డిౖవైజ్‌కి ఒకే కనెక్టర్‌ అటాచ్‌ చేసుకుని.. మసాజ్‌ హెడ్స్‌ని చేతులు, తొడలు, పొత్తికడుపు, నడుము, పిరుదులు ఇలా ఇతర భాగాలకు అమర్చి.. చక్కటి ట్రీట్మెంట్‌ అందించొచ్చు. ఈ మసాజర్‌ కొల్లాజెన్‌ ఫైబర్స్‌ను ప్రేరేపించి, వయసుతో వచ్చే ముడతలను పూర్తిగా తగ్గిస్తుంది. స్కిన్‌టోన్‌ మెరుగుపరుస్తుంది. డివైజ్‌కి ఎడమవైపు భాగంలో ఇంటెలిజెంట్‌ డిస్‌ప్లే ఉంటుంది. దానిలో 12 లెవల్స్‌ ఉండగా.. ఒత్తిడి తగ్గేందుకు 1 నుంచి 3 లెవల్స్, డబుల్‌ చిన్‌ తగ్గేందుకు 4 నుంచి 5 లెవల్స్‌ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇక దవడ భాగం వెడల్పుగా ఉన్నవారు ఠి షేప్‌ కోసం 3 నెలల పాటు.. 6 నుంచి 8 లెవల్స్‌ వాడాల్సి ఉంటుంది.

చదవండి: Health Tips In Telugu: నీరు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడంతోసహా.. ఇంకెన్నో సమస్యలు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement