
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లోని రిజ్క్స్‌మ్యూజియంలో దాదాపు 200 ఏళ్ల నాటి, మంచి కండిషన్‌లో ఉన్న కండోమ్ (Condome) ను ప్రదర్శనకు ఉంచారు. ఈ కండోమ్‌ను గొర్రె అపెండిక్స్ (పేగు)తో తయారు చేసినట్టు భావిస్తున్నారు. దీనిపై ఉన్న ఒక పెయింటింగ్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక నన్, ముగ్గురు మతాధికారులు ఉన్న ఈ పెయింటింగ్‌ను "లగ్జరీ సావనీర్"గా పేర్కొంటూ వేలానికి ఉంచారు. అంతేకాదు ఈ మ్యూజియం కళా సేకరణలో ఉంచిన తొలి గర్భనిరోధక సాధకం ఇదేనట.
1830 నాటి ఈ కండోమ్, 19వ శతాబ్దపు వ్యభిచారం , లైంగికతపై జరిగే ప్రదర్శనలో భాగమని మ్యూజియం నిర్వాహకులు వె ల్లడించారు. ఇంకా ఈ డచ్ మ్యూజియంలో దాదాపు 7,50,000 వరకు ప్రింట్లు, డ్రాయింగ్‌లు, ఫోటోలు కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ఉన్నాయి."అక్కడ, అది నా ఎంపిక' అని అర్థం వచ్చే ‘వోయిలా మోన్ చోయిక్స్’( ఇది నా చాయిస్) అనే శాసనం బ్రహ్మచర్యం , గ్రీకు పురాణాల నుండి పారిస్ తీర్పు రెండింటికీ అనుకరణగా ఉందని మ్యూజియం తెలిపింది.
చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..
చూసేందుకు ఎగబడుతున్న జనం
ఈ కళాఖండాన్ని ప్రదర్శనలో ఉంచినప్పటి నుంచీ, మ్యూజియం యువకులు, వృద్ధులతో నిండిపోయిందని రిజ్క్స్‌మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ తెలిపారు. స్పందన అద్భుతంగా ఉందన్నారు. అయితే మొదటిసారి వేలంలో మొదటిసారి ఈ కండోమ్‌ను ఉంచినపుడు తాను, తన సహద్యోగి నవ్వుకున్నామని ఆమె గుర్తు చేసుకున్నారు. 2024లో జరిగిన ఒక వేలంలో మ్యూజియం దీనిని కొనుగోలు చేసిందట. ఆ తర్వాత వారు దాన్ని అతినీలలోహిత (UV) కాంతిలో పరీక్షించారు. అలా ఆ కండోమ్‌ను ఎవరూ ఉపయోగించ లేదని భావిస్తున్నామన్నారు. 2025 నవంబర్ చివరి వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుంది.