మండే ఎండల్లో..పచ్చదనం..చల్లదనం కూడా! | Best Indoor Plants for Oxygen and cool in summer | Sakshi
Sakshi News home page

మండే ఎండల్లో..పచ్చదనం..చల్లదనం కూడా!

May 10 2025 11:40 AM | Updated on May 10 2025 12:00 PM

Best Indoor Plants for Oxygen and cool in summer

చాలామంది ఇళ్లలో రకరకాల మొక్కలను పెంచుకుంటారు. ఒక్కో సీజన్‌లో ఒక్కో మొక్కకు ప్రత్యేక  ప్రాధాన్యత ఉంటుంది. ఒక సీజన్లో కొన్ని పూలు పూస్తాయి మరో సీజన్లో మరికొన్ని మొక్కలు పూలు పూస్తాయి. కొన్ని ఇండోర్‌ మొక్కలు, ఔట్‌డోర్‌ మొక్కలు ఉంటాయి. కొన్ని రకాల మొక్కలని మనం పూజిస్తాం. మరికొన్ని మొక్కలు మనకు ఆక్సిజన్‌ను అధికంగా అందిస్తాయి. ఇవి చుట్టుపక్కల ప్రదేశాల్లో కూడా గాలిని శుభ్రం చేస్తాయి. అంతేకాదు, ఈ మండే ఎండలకు కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటే ఇంటికి చల్లదనాన్ని ఇస్తాయి. 

మల్లె...
ఇది ఎంతో పరిమళభరితంగా ఉంటుంది. ఈ మొక్క మన భారతదేశంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ పూలమొక్కను పెంచుకుంటే మీ ఇంటి తోటతో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిమళభరితంగా మారిపోతాయి. మల్లె ఇంట్లోని వేడిని గ్రహిస్తుంది. గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.  ఇంటి పరిసర ప్రాంతాలను చల్లబరిచి గాలిని కూడా శుభ్రపరిచే శక్తి మల్లె చెట్టుకు ఉంది.  

 ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో

మందార మొక్క.. 
మందార చెట్టును దేవతావృక్షంగా పరిగణిస్తారు. దీని పూలను పూజలో ఉపయోగిస్తారు. దీనిపూలు ముఖ్యంగా కాళీమాతకి, దుర్గామాతకి ఎంతో ఇష్టం. ఇది హైబిస్కస్‌ జాతికి చెందిన మొక్క. దీనికి పెద్దగా నిర్వహణ అవసరం ఉండదు. ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకుంటే పరిసర ప్రాంతాలను చల్లబరిచి గాలిని ప్యూరిఫై చేస్తుంది  అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు ఈ మొక్క నుంచి వచ్చే గాలిని పీల్చుకుంటే త్వరగా కోలుకుంటారు.

జెరెనియం... 
ఈ మొక్క కూడా రూమ్‌ టెంపరేచర్ను తగ్గిస్తుంది ఎక్కువ అధిక ఉష్ణోగ్రత ఉండే దేశాల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పువ్వుకు ఐదు రెక్కలు ఉండి తెలుపు, పర్పుల్‌ కలర్‌లో కనిపిస్తుంది ఇది మంచి ఇండోర్‌ ప్లాంట్‌. ఇది సంవత్సరం అంతా పూలు పూస్తుంది.

చదవండి: రెండేళ్ల వయసులో అనాథలా ఆశ్రమానికి : కట్‌ చేస్తే..!

లావెండర్‌... 
లావెండర్‌ మొక్క మంచి ఇండోర్‌ ప్లాంట్‌. దీంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. నిద్రలేమి, యాంగ్సైటీ, స్ట్రెస్‌ నుంచి  రిలీవ్‌ చేస్తుంది. ఈ మొక్కను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్టుకుంటే ఇంటికి చల్లదనాన్ని ఇస్తుంది.

పీస్‌ లిల్లీ... 
ఈ మొక్క కూడా మంచి ఇండోర్‌ ప్లాంట్‌. చూడటానికి ఆహ్లాదకరంగా తెలుపు పువ్వులతో కనిపించే ఈ మొక్కను పెంచుకుంటే గాలిని శుభ్రం చేయడమే కాదు... చల్లదనాన్నీ అందిస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement