విల్లు అందుకుంటే ఇక విలయమే!

Action Adventure Video Game Wild Heart  - Sakshi

ఒక పెద్ద చెట్టు కింద నిల్చుంటాడు కథానాయకుడు. అది చెట్టు కాదని భయానకమైన మాన్‌స్టర్‌ అని తెలుసుకోవడానికి ఎంతో సేపు పట్టదు. ఒక కొండ పక్కన కూర్చొని ఉంటాడు హీరో...‘కొండ కదులుతున్నదేమిటి!’ అనే ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే అది క్రూరమైన మాన్‌స్టర్‌ అని తెలుసుకుంటాడు. పూలతోటల నుంచి మంచుఎడారి వరకు రకరకాల మాన్‌స్టర్‌లను బుక్‌వార్క్‌లాంటి యంత్రం సహాయంతో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే వైల్డ్‌ హార్ట్స్‌ గేమ్‌.

యాక్షన్‌–అడ్వెంచర్‌ వీడియో గేమ్‌ ‘వైల్డ్‌ హార్ట్‌’ నేడు విడుదల అవుతుంది. జపాన్‌కు చెందిన వీడియో గేమింగ్‌ కంపెనీ వొమెగా ఫోర్స్‌ దీన్ని రూపొందించింది. మాన్‌స్టర్‌ హంటింగ్‌ గేమ్స్‌లో చేయి తిరిగిన కొటారో హిరాట్‌ ఈ గేమ్‌కు డైరెక్టర్‌. అలనాటి ఫ్యూడల్‌ జపాన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ‘అజుమి’ అనే మాయాప్రపంచాన్ని సృష్టించారు.

భయంకరమైన మాన్‌స్టర్స్‌ను వేటాడే బాధ్యత ప్లేయర్స్‌పై ఉంటుంది. మోనస్టర్స్‌ను వేటాడడానికి వాగస, కలూనాలాంటి ఎనిమిది ఆయుధాలు ఈ గేమ్‌లో ఉంటాయి. బుక్‌వార్క్‌లాంటి యంత్రంతో ఎమిమీ దారిని బ్లాక్‌ చేయవచ్చు.

ప్లాట్‌పామ్స్‌: పీఎస్‌ 5, ఎక్స్‌బాక్స్‌ సిరీస్‌ ఎక్స్‌/ఎస్, పీసీ
మోడ్‌: సింగిల్‌ ప్లేయర్, మల్టీ ప్లేయర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top