
ఆమె అందరిలా ఆడుతూ పాడుతూ జీవించలేదు. తన వయసు పిల్లలతో సరదా ఆటలు ఆడలేపోయింది. అయినా జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగే నేర్చుకుంది. తన జీవితాన్ని కబళించాలని చూసిన వ్యాధికే చుక్కులు చూపించేలా జీవించింది. బాధించే వ్యాధిని ఉన్నతంగా జీవించేందుకు మార్గంగా మలుచుకోవడం ఎలాగో తన సోషల్ మీడియా పోస్ట్‌లతో చెప్పి..అందరినీ కదిలించింది, ఆలోచించేలా చేసింది. ఆ మహ్మమ్మారిపై ఆ టీనేజర్ చేసిన పోరాటం వింటే కన్నీళ్లు ఆగవు. మరణమే శోకించేలా బతికి చూపించి..తనలా కేన్సర్‌తో పోరాడుతున్న వాళ్లకి ఆదర్శంగా నిలిచింది.
ఆ అమ్మాయే అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన 14 ఏళ్ల జుజా బీన్. అందరిలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన మూడేళ్ల ప్రాయానికే కేన్సర్ బారిన పడింది. ఏదోలా చికిత్సలు తీసుకుని కోలుకుంది అనేలోపు మరోసారి అంటే ఎనిమిదేళ్ల ప్రాయంలో మరోసారి ఆ మహమ్మారి బారిన పడింది. ఇలా చిన్న పిల్లలో రావడం అత్యంత అరుదు. దీని కారణంగా బాల్యమంతా ఆస్పత్రుల చుట్టు, చికిత్సలు తీసుకోవడంతోనే సరిపోయింది ఆమెకు.
అయితేనేం ఈ మహ్మమ్మారి పెడుతున్న ట్రబుల్స్‌కి ఆ టీనేజర్ జీవితం విలువ ఏంటో తెలుసుకోగలిగానూ, మంచి జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నాని, సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చి..అందర్నీ ఆశ్చర్యపోయాలా చేయడమే కాదు..జీవితం గొప్పదనం ఏంటో తెలుసుకునేలా చేసిది.
అంతేగాదు జీవితం పరమార్థం అంటే ఏంటో తన కేన్సర్ పోరాటంతో ఎదుర్కొన్న వాటిని ప్రస్తావిస్తూ..నెటిజన్లే ఇంప్రెస్ అయ్యేలా చేసింది. అంతేగాదు ఆ పోస్టుల్లో ఆమె చికిత్సలు తీసుకునే విధానం, ఎదుర్కొంటున్న బాధలను వివరిస్తూ..స్ఫూర్తిదాయకంగా మాట్లాడే మాటలు ఎందరినో కదిలించాయి. ఆమె బతకాలని ఆకాంక్షించలా ఆశీర్వాదాలు వెల్లువెత్తాయి కూడా. కానీ అవేం ఆ విధి ముందు ఫలించలేదు. చివరికి కేన్సర్‌తో పోరాడుతూనే 14 ఏళ్లకే చనిపోయింది జూజూ. రెండు వారాల క్రితం ఆమె చేసిన పోస్ట్ ఇప్పటికీ నెటిజన్ల ముందు కదలాడుతుంది.
ఆ పోస్ట్‌లో ఏ రాసిందంటే..
తాను గనుక ఈ మహమ్మారి నుంచి బయటపడితే..ఈ సెప్టెంబర్ మాసం, బాల్య కేన్సర్ అవగాహన నెలగా పాటిస్తారు. కావున తాను ఈ వ్యాధిపై అవగాహన కల్పించేలా తన కథను పంచుకుంటానని రాసింది. కానీ ఆ అమ్మాయి ఆ కోరిక తీరకుండానే మృత్యు ఒడికి వెళ్లిపోవడం అందర్నీ కంటతడిపెట్టేలా చేసింది. అంతేగాదు ఆమె తన కేన్సర్ పోరాట సమయంలో పెట్టన ఓ ఆసక్తికర పోస్టు ఎంత భావోద్వేగంగా ఉందంటే..అందరూ పొందే సాధారణ సౌకర్యాలకు కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది.
రుచికరమైన భోజనం, మంచి డ్రెస్సింగ్ స్టైల్, జంతువులతో గడపడం వంటి వాటిని ఆ వ్యాధి నుంచి బయటపడ్డ కొన్ని రోజుల్లోనైనా పొందగలిగా నేను గ్రేట్ అని చెప్పడం చూస్తుంటే మనసు చివుక్కుమంటుంది. కానీ జుజు ఉన్నన్నాళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది, పైగా మరణ శాసనాన్నే మార్చేలా బతికేసాహసం చేసి అందరితచేత శెభాష్ అనిపించుకుంది కూడా.
కాగా, జూజూ గత 11 ఏళ్లుగా అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అనే రక్త క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఏకంగా మూడు సార్లు ఎముక మజ్జ మార్పిడి చేయించుకుంది. ఇంత భారమైన బాధలో కూడా నెటిజన్లతో తన భావాలను పంచుకునేది. ఈ పరిస్థితిలో మీకు ఎలా అనిపిస్తుంటుందని ఒక నెటిజన్న అడిగిన ప్రశ్నకు..నా వయసు అమ్మాయిల మాదిరిగా లేకపోయాననే బాధ వెంటాడుతుంటుందని చెప్పి మారు మాట్లాడకుండా చేసింది.
చిన్నగా ఉన్నప్పుడూ జుట్టు ఎందుకు రాలుతుందో తెలియలేదు. పెద్దఅయ్యాక లెక్కలేనన్ని సార్లు జుట్టు ఊడిపోవటంతో తాను సాధారణ అమ్మాయిని కాదని చమత్కరిస్తూ..కన్నీళ్లు వచ్చేలా చేసింది. ప్రస్తుతం జుజూ తల్లిదండ్రులు ఆమెలాంటి కేన్సర్ బాధితులకు చికిత్స అందేలా గో ఫండ్ వెబ్‌పేజ్‌లో సాయం అభ్యర్థిస్తుండటం విశేషం. మరో విశేషం ఏంటంటే ఆమె కేన్సర్ జర్నీ ఇన్‌స్టాగ్రామ్‌కి ఏకంగా ఒక మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
(చదవండి: 'ధోలిడా' పాటకి అమెరికన్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెప్పులు..!)