కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం | Sakshi
Sakshi News home page

కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం

Published Sun, Oct 1 2023 6:31 AM

10-year-old from Kids Got Talent breaks chess record - Sakshi

ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విజేతల అద్భుత విజయాలను డాక్యుమెంటరీలలో చూసిన తరువాత తాను కూడా ఏదైనా సాధించాలనుకుంది మలేసియాకు చెందిన పది సంవత్సరాల పునీత మలర్‌ రాజశేఖర్‌. ఈ చిన్నారికి చెస్‌ అంటే ఇష్టం.

తాజాగా... కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 45.72 సెకన్‌లలో చెస్‌బోర్డ్‌పై  అత్యంత వేగంగా 32 పావులను సెట్‌ చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. తండ్రి సహకారంతో నాలుగు నెలల పాటు కష్టపడి ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement