403 అర్జీల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

403 అర్జీల స్వీకరణ

Sep 1 2026 1:13 AM | Updated on Sep 1 2026 1:13 AM

403 అర్జీల స్వీకరణ నేడు పింఛన్ల పంపిణీ ప్రమాద ఘటనలో వ్యక్తిపై కేసు నమోదు ‘పశ్చిమ’ రెడ్‌క్రాస్‌కు ప్రథమ బహుమతి ఆకివీడు సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్‌ నియామకం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అర్జీలు పునరావృతం కాకుండా లబ్ధిదారులు సంతృప్తిని దృష్టిలో ఉంచుకుని పరిష్కారం అందించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో భాగంగా 403 అర్జీలు స్వీకరించారు.

అర్జీల్లో కొన్ని..

● టి.నరసాపురం మండలం మెట్టగూడేనికి చెందిన కుప్పాల సూర్యనారాయణ తన భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు.

● జంగారెడ్డిగూడేనికి చెందిన కుంచె సీతాలావణ్య తన భర్త చనిపోయారని, ఆస్తిని కుమారుడు రాయించుకుని తనను చూడటం లేదని వాపోయారు. తన ఆస్తి తనకు ఇప్పించడంతో పాటు రేషన్‌ కార్డు, పింఛన్‌ మంజూరు చేయాలని కోరారు,

● ఏలూరులోని పడమరవీధికి చెందిన బండుచోడే వెంకటరమణ వాటర్‌ కనెక్షన్‌కు దరఖాస్తు చేసినా చర్యలు తీసుకోలేదని, అ యినా నీటిపన్ను కట్టాలని మున్సిపల్‌ సి బ్బంది ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో మంగళ వారం 2,53,845 మంది పింఛన్‌దారులకు రూ.111.60 కోట్లు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు 4,932 మంది ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించామన్నారు.

ద్వారకాతిరుమల: స్కూటీని ఢీకొనడంతో చినవెంకన్న దేవస్థానం ఉద్యోగి, ఆర్‌ఎంపీ వైద్యుడు చిలకపాటి వెంకట కోదండ రామాచార్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కోదండ రామాచార్యులు ఆగస్టు 29న సాయంత్రం 4.30 గంటలకు తన స్కూటీపై అమ్మా అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఓ వ్యక్తికి వైద్యం చేసి, లక్ష్మీపురం వెళ్లారు. అక్కడి నుంచి యూటర్న్‌ తీసుకుని ద్వారకాతిరుమలకు వస్తున్నారు. ఈ సమయంలో భీమడోలు వైపు నుంచి ద్వారకాతిరుమలకు వెళుతు న్న భీమడోలు మండలం సూరప్పగూడెంకు చెందిన చిన్నమిల్లి బుల్లిరత్నం, ఘటనా స్థలం వద్ద స్కూటీని వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకట కోదండ రామాచార్యులు రో డ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. అలాగే ఎడమ కాలి పాదంపై నరం తెగిపోయింది. దేవస్థానం అంబులెన్స్‌లో ఏలూరులోని ప్రై వేట్‌ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రు డి కుమారుడు దిత్తాకవి జయవెంకట సింహాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.సుధీర్‌ తెలిపారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలకుగా ను రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. విజయవాడలో జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి గోల్డ్‌మెడల్‌ అందుకోనున్నారు. 2024–25లో జిల్లాలో రెడ్‌క్రాస్‌ సేవల విస్తరణ తదితర కార్యక్రమాలకు సహకరించిన అప్పటి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి కూడా గోల్డ్‌మెడల్‌ లభించింది. అలాగే ప్రతిష్టాత్మక అవార్డును జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఎంఎస్‌వీఎస్‌ భద్రిరాజు అందుకోనున్నారు. ముఖ్యంగా బ్లడ్‌ సెంటర్‌, తలసేమియా సెంటర్‌, మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ వంటి కీలక సేవా ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు జిల్లా రెడ్‌క్రాస్‌ కమిటీ పేర్కొంది.

ఆకివీడు : స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీ హెచ్‌సీ)లో గైనకాలజిస్ట్‌, ప్రసూతి వైద్యసేవలను పునః ప్రారంభించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విక్రమ్‌ తెలిపారు. గత నెల 27న ‘సీహెచ్‌సీలో వైద్యుల కొరతతో ఇక్కటు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించి గైనకాలజిస్ట్‌ను నియమించారన్నారు. కై కలూరు నుంచి డాక్టర్‌ సునీత ప్రతి బుధ, శుక్రవారాల్లో ఇక్కడ సే వలందిస్తారన్నారు. రానున్న రోజుల్లో ఆమె సే వల్ని రోజువారీగా వినియోగించుకుంటామని చెప్పారు. త్వరలో ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న మిగిలిన వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement