మానసిక వికలాంగురాలిపై అత్యాచారం | - | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

Feb 4 2026 7:21 AM | Updated on Feb 4 2026 7:21 AM

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

చింతలపూడి: మానసిక వైకల్యంతో ఉన్న యువతిపై అమానుషానికి ఒడిగట్టిన కామాంధుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. చింతలపూడి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగారెడ్డిగూడెం ఇన్‌చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర కేసు వివరాలను వెల్లడించారు. చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి మానసిక వైకల్యంతో బాధపడుతోంది. దీనిని ఆసరాగా చేసుకున్న అదే గ్రామానికి చెందిన కొప్పుల ఏసు అనే వ్యక్తి ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి పలుమార్లు యువతిపై అత్యాచారం చేశాడు. యువతికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎవరికీ చెప్పుకోలేదని, ఆ ధీమాతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని డీఎస్పీ తెలిపారు. రెండు నెలల తర్వాత యువతిలో శారీరక మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో ఆమె రెండు నెలల గర్భవతి అని తేలడంతో, కుటుంబ సభ్యులు గతేడాది డిసెంబర్‌ 13న పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన బాధిత యువతిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానితులను అదుపులోకి తీసుకుని సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా నేరాన్ని శాసీ్త్రయంగా ధ్రువీకరించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితుడిని పట్టుకున్న చింతలపూడి సీఐ క్రాంతికుమార్‌, ఎస్సై సతీష్‌ కుమార్‌, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement