కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైళ్లు
ఏలూరు (టూటౌన్): కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రైన్ నెం.07617 కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ఈ నెల 14న, ట్రైన్ నెం.07618 తిరువన్నామలై–కాకినాడ టౌన్ మధ్య ఈనెల 16న నడుస్తుందన్నారు. ఈ రైలు కాకినాడ టౌన్‌లో బయలు దేరి సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరంటౌన్, ఆకివీడు, కై కలూలరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు స్టేషన్లలో ఆగనుంది.
కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య ప్రత్యేక సర్వీసులు
కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య 12 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు.ట్రైన్ నెం.07705 కాకినాడ టౌన్–హిస్సార్ మధ్య ఈ నెల 19 నుంచి మార్చి 26 మధ్య ఆరు సర్వీసులు, ట్రైన్ నెం.07706 హిస్సార్–కాకినాడ టౌన్ మధ్య ఈ నెల 22 నుంచి మార్చి 29 మధ్య ఆరు సర్వీసులు నడుస్తాయని స్పష్టం చేశారు.
జంగారెడ్డిగూడెం: వరల్డ్ ట్రాన్స్‌ప్లాంట్ గేమ్స్ మెడలిస్ట్ ఎస్‌ఎన్ నాయుడు మరో ఘన విజయం సాధించారు. జంగారెడ్డిగూడెం అటవీశాఖ సెక్షన్ అధికారిగా పని చేస్తున్న నాగ వాసు నాయుడు సుంకర (ఎస్.ఎన్. నాయుడు) ఇటీవల పూణేలో నిర్వహించిన మాస్టర్స్ నేషనల్ గేమ్స్‌లో 5 కిలోమీటర్ల రేస్‌వాక్ పోటీలో రజత పతకం సాధించాడు. ఈ మేరకు ఎస్‌ఎన్ నాయుడును మంగళవారం అటవీశాఖ అధికారులతో పాటు, జంగారెడ్డిగూడెం అటవీశాఖ సెక్షన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
ఏలూరు (టూటౌన్): ఆక్వా ఫీడ్ ధరలు పెంపు దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ ఫీడ్ తయారీ కంపెనీలు సిండికేట్ గా మారి ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడం తగదన్నారు. టన్ను ఫీడ్ కు రూ.4వే లు పెంచడం వలన ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సోయాబీన్ వంటి రా మెటీరియల్ ధరలు బాగా తగ్గినప్పుడు ఫీడ్ ధరలు తగ్గించలేదని, ఇప్పుడు రా మెటీరియల్ ధర పెరిగిందని ధరలు పెంచుతున్నట్లుగా కంపెనీలు చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా పెంచిన ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
పోలవరం రూరల్: పట్టిసం మహాశివరాత్రిఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం చేసే ఏర్పాట్లు అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ తెలిపారు. పోలవరం మండలం పట్టిసం శివక్షేత్రం వద్ద రెండవ దఫా సమావేశం మంగళవారం ఉత్సవ కమిటీ ఛైర్మన్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధికార యంత్రాంగం పటిష్టమైన పనులు చేపట్టాలన్నారు. శాఖల వారీగా నిర్ధేశించిన పనులు ఎంత వరకు పూర్తయ్యాయనే విషయాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు. వాహనాల పార్కింగ్‌కు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. నదిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో నది దాటేందుకు స్పీడ్ బోట్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఐటీడీఏ పీఓ రాములునాయక్, ఆర్టీసీ ఆర్‌ఎం సబ్నమ్, వంశపారంపర్య ధర్మకర్త కె.వీరభద్రరావు, డీఎల్‌పీఓ సుబ్బారాయుడు, తహసీల్దార్ ఆర్‌ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ టౌన్–తిరువన్నామలై మధ్య ప్రత్యేక రైళ్లు


