ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?
వివాహితపై యువకుడి దాడి
ఉంగుటూరు బి–బ్లాకు అటవీ ప్రాంతంలో ఓ యువకుడు వివాహిత శరీరంలోని ప్రైవేట్ పార్టులను కాల్చేసి హింసించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 8లో u
● రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయి
● మాజీ హోం మంత్రి తానేటి వనిత
ద్వారకాతిరుమల: ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే సందేహం కలుగుతోందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నియోజకవర్గ ముఖ్య నేతలతో కలసి మంగళవారం వెళ్లి పరామర్శించినట్టు ద్వారకాతిరుమలలో విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై కూటమి దాడులు దారుణమని ఆమె మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులను చూస్తుంటే బీహార్‌ను తలపిస్తున్నాయని, రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న, దీటుగా సమాధానం చెబుతున్న వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి ఇళ్ల మీద, వారి ఆస్తుల మీద ఈ రకంగా దాడులు చేయడం దారుణమని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నిగ్గు తేల్చడంతో ఇలా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. జోగి రమేష్‌ను పరామర్శించినవారిలో పార్టీ నేతలు డి.బంగారమ్మ, బి.సాయికృష్ణ, పి.యోహాను, పి.ఏసుబాబు, జి.శ్రీను, కె.రుక్మిణీనాథ్, ఎం.చిట్టిబాబు తదితరులు ఉన్నారు.


