కూటమి పాలనలో రాష్ట్రం అప్పులమయం
నూజివీడు: సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చెస్తానని చంద్రబాబు చెప్పారని, అయితే ప్రస్తుత కూటమి పాలనలో రాష్ట్రం అప్పుల్లో దూసుకుపోతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ధ్వజమెత్తారు. నాడు జగన్ పాలనలో సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తే నేడు చంద్రబాబు అప్పుల క్యాలెండర్ అమలు చే స్తున్నారని ఎద్దేవా చేశారు. నూజివీడు పట్టణ, మండల పార్టీ నిర్మాణ సంస్థాగత విస్తృత సమావేశాన్ని శనివారం స్థానిక వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కా ర్యాలయమైన ద్వారకా ఎస్టేట్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎన్నార్ మాట్లాడుతూ పేకాట, మట్టి, ఇసుక, మద్యం మాఫియాలే రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్నాయన్నారు. జూదాలే టీడీపీ వాళ్లకు భుక్తిగా మారాయని విమర్శించారు. అవినీతి, అప్పులు, అక్రమాలు, దౌర్జన్యాలతో పాలన సాగుతోందన్నా రు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా తాము మోసపోయామని బాధపడుతున్నారని, రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమన్నారు. అలాగే పాలకులకు జగన్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. సూపర్ సిక్స్ వాగ్దానాలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. గ్రామస్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు జగన్ దృష్టి పెట్టారని, గ్రా మ, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసి వారంద రి వివరాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులపై సైతం రౌడీషీట్లు పెడుతున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేసి 2029 ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.
పాలనలో ప్రభుత్వం విఫలం
చంద్రబాబు ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్‌ను అనవసరంగా ఓడించామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. పూర్తయిన ప్రభు త్వ భవనాలను కూడా ప్రారంభించకుండా పాలకులు కాలక్షేపం చేస్తున్నారని, వైఎస్ జగన్ ప్రారంభించే బస్సు యాత్రతో రాష్ట్ర ప్రభుత్వ పతనం ప్రా రంభమవుతుందన్నారు. కార్యకర్తలు ఎవరినీ చూసి భయపడాల్సిన పనిలేదని, కలిసికట్టుగా పార్టీ పటిష్టతకు పనిచేయాలన్నారు.
18 నెలలు గడిచినా అభివృద్ధి లేదు
చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు గడిచినా అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదని ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు. పేకాట, కోడిపందేలు తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.జయప్రకాష్, జిల్లా యూత్ అధ్యక్షుడు కామిరెడ్డి నాని మాట్లాడారు. నూజివీడు పట్టణ, మండల, ముసునూరు, ఆగిరిపల్లి, చాట్రాయి మండలాల అధ్యక్షులు శీలం రాము, పోలిమెట్ల శివ, మూల్పురి నాగవల్లేశ్వరరావు, బెజవాడ రాంబాబు, పుచ్ఛకాయల సుబ్బారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, ముసునూరు జెడ్పీటీసీ వరికూటి ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్, ఏలూరు నగర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, ఎంపీపీలు కొండా దుర్గాభవాని, గోళ్ల అనూష, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మలిశెట్టి బాబీ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


