
పాటించాల్సిన జాగ్రత్తలు
● వర్షం వచ్చేటప్పుడు చెట్ల కింద ఉండరాదు. ముఖ్యంగా ఎత్తయిన చెట్టు కింద అస్సలు ఉండకూడదు.
● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.
● లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో విడుదలయ్యే వేడి ఒక్కసారిగా మనిషిని చేరగానే గుండైపె ప్రభావం చూపుతుంది.
● వర్షపు సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోల్టులు, కెమేరాలు, సెల్‌ఫోన్‌లు దగ్గర లేకుండా చూసుకోవాలి. లేకుంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
● మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో టీవీలకు ఉన్న విద్యుత్ కేబుల్ కనెక్షన్ తొలగించాలి.
● వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. తడి ప్రదేశాల్లో ఉండకపోవడం చాలా మంచిది.