మే 10, 11 తేదీల్లో తెలుగు సాహితీ సంబరాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో వచ్చే మే నెల 10, 11 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు కార్యక్రమం జయప్రదం చేయాలని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కోరారు. స్థానిక మహలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశ్రీ కళావేదిక ద్వారా ఇంతవరకూ వివిధ ప్రాంతాలలో 147 శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించి 148వ కార్యక్రమాన్ని శ్రీప్రపంచ తెలుగు సాహితీ సంబరాల్ఙు పేరుతో మే నెల 10, 11 తేదీల్లో ప్రపంచ రికార్డు స్థాయిలో ఏలూరులో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక ప్రతినిధులు కొల్లిరమావతి, జీ.ఈశ్వరీ భూషణం, టీ.పార్థసారథి, శ్రీహరికోటి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి ట్రస్ట్‌కు రూ.18 లక్షల విరాళం
ద్వారకాతిరుమల: దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్ కంపెనీ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, కంపెనీ ప్రతినిధులు శుక్రవారం నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ. 18 లక్షలను జమ చేశారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈఓకు అందించారు. ఈఓ వారికి కండువాలు కప్పి ఘనంగా సత్కరించగా, ఆలయ అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు. అంతక ముందు దాతలు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఇంతవ వరకు నెక్స్‌జెన్ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1,29,08,007లు అందించినట్టు ఈఓ తెలిపారు.
ఏలూరు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చింది. నగరంతోపాటు, ఆయా పట్టణాలు, పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. గురువారం అర్థరాత్రి వరకూ పోలీసులు భారీ ఎత్తున మోహరించి తనిఖీ చేశారు. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ స్వయంగా తనిఖీలు పర్యవేక్షించారు. ఆశ్రం సెంటర్, కలపర్రు టోల్‌ప్లాజా, తంగెళ్ళమూడి, కండ్రికగూడెం తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఐజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ నేరాలు నివారించటం, నేరస్తుల కదలికలపై నిఘా ఉంచుతూ వారిని కట్టడి చేయటమే పోలీసుల లక్ష్యం అన్నారు.
మే 10, 11 తేదీల్లో తెలుగు సాహితీ సంబరాలు
మే 10, 11 తేదీల్లో తెలుగు సాహితీ సంబరాలు


