వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి
‘డైట్’లో పోస్టులకు దరఖాస్తులు
దూబచర్లలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో వివిధ విభాగాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు ఏలూరు డీఈఓ తెలిపారు. 8లో u
ఏలూరు(మెట్రో): కనీస మద్దతు ధర స్థాయి నుంచి పండించిన పంటకు ధరను డిమాండ్ చేసే స్థాయికి రైతులను తీసుకువెళ్లేలా పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం వ్యవసా య, అనుబంధ రంగాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు, రైతులతో సమావేశయ్యా రు. సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేలా రైతులను స మాయత్తం చేస్తామన్నారు. సాగులో డ్రోన్లతో పాటు యాంత్రీకరణను ప్రోత్సహించడంతో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పి ంచాలన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందు కు ప్రతి శుక్రవారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషాను ఆదేశించారు.
రుణాల జాబితాలను.. జిల్లాలో స్వయం ఉపాధి పథకాల ఏర్పాటుకు రుణాల కోసం వెనుకబడిన త రగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు కార్పొరేషన్ ద్వారా యువత చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే బ్యాంకులకు పంపాలని క లెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం ఎంపీడీఓలతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మార్చి 25 నాటికి 30,436 మంది యువత దరఖాస్తులు చేసుకున్నారన్నారు.
సత్యసాయి పథకం నిర్వహణపై
శ్రీ సత్యసాయి తాగునీటి పథకం నిర్వహణ పనులపై కలెక్టర్ సమీక్షించారు. 14 మండలాలు 158 గ్రామాల్లో 3.75 లక్షల జనాభాకు నీరందించే పథ కం పనులు పక్కాగా నిర్వహించాలని సూచించారు.


