బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉగాది రోజున వన దేవతలు, కొండ దేవతలకు పూజలు చేస్తారు. ఇంటి పేర్లతో పూజలు చేయడమే కాకుండా జంతు బలులు ఇస్తారు. వియ్యంకుడు వరుసయ్యే వారికి బలిచ్చిన జంతువు కుడి తొడను ఇస్తారు. జంతువు తొడతో కూర వండి సహపంక్తి భోజనాలు చేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారమని గిరిజనులు చెబుతున్నారు. ఉగాది ఉత్సవాలను దాసియ్యపాలెం, సీతప్పగూడెం, ముప్పినవారిగూడెం, మంచులవారిగూడెం గ్రామాల్లో వైభవంగా చేస్తారు. గంగానమ్మ, గుబ్బల మంగమ్మ, ముత్యాలమ్మ, నాగులమ్మ, కనకదుర్గమ్మ, పోచమ్మతల్లి, సమ్మక్క సారక్క, సూదికొండ మావుళ్ళమ్మ అమ్మవార్లకు ఘనంగా పూజలు చేసి నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. గిరిజన ప్రాంతంలో కొంతమంది పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్‌ను తెలుసుకుంటే మరికొంత మంది పూనకాల్లో వచ్చిన దేవతల ద్వారా వారి భవిష్యత్‌ను తెలుసుకోవడం విశేషం. గ్రామంలోని పాడిపంటలు, సుఖసంతోషాల గురించి, భవిష్యత్ గురించి పూనకాల నుంచి వచ్చిన దేవతల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. పూనకాల సమయంలో డప్పు వాయిద్యాలతో గ్రామాలు దద్దరిల్లిపోతాయి.
నేడు వన, గ్రామ దేవతలకు ఘనంగా పూజలు
మామిడి కాయ పండుగకు ఏర్పాట్లు పూర్తి
ఉగాది ఉత్సవాలకు మన్యం సిద్ధం
ఉగాది ఉత్సవాలకు మన్యం సిద్ధం


