‘భారత్‌’ గౌరవ్‌ రైలుకు మంచి స్పందన | - | Sakshi
Sakshi News home page

‘భారత్‌’ గౌరవ్‌ రైలుకు మంచి స్పందన

Mar 20 2023 1:14 AM | Updated on Mar 20 2023 1:14 AM

నూతన కార్యవర్గ సభ్యులు  - Sakshi

నూతన కార్యవర్గ సభ్యులు

ఏలూరు (టూటౌన్‌) : ఉభయ తెలుగు రా ష్ట్రాల నుంచి ప్రారంభమైన మొదటి భారత్‌ గౌరవ్‌ రైలుకు శనివారం రాత్రి ఏలూరు, పరిసర ప్రాంతాల పర్యాటకుల నుంచి మంచి స్పందన లభించింది. పుణ్యక్షేత్ర యాత్రలో పూరి–కాశీ–అయోధ్యకు ప్రయాణించేందుకు ఏలూరు రైల్వేస్టేషన్‌ నుంచి 14 మంది యాత్రికులు భారత్‌ గౌరవ్‌ రైలు ఎక్కారు. రైలుకు ఏలూరు స్టేషన్‌లో ఘన స్వాగతం లభించింది. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని చాటిచెప్పేలా రైల్వేశాఖ భారత్‌ గౌరవ్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి ఇండి యన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఈ రైలును ప్రారంభించింది.

ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ ఎన్నిక

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం స్థానిక నరసింహరావుపేటలోని అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగింది. అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా కె.రత్నారావు, వి.చలపతి రావు ఎన్నికయ్యారు. అలాగే అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడిగా కిలార పు శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా ఎం. శంకరరావు, ఎంఎల్‌ నారాయణ, జేఎస్‌ నారాయణ, ఎం.పుల్లారావు, కేపీ రంగారావు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ఆళ్ల నానిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నానిని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించడంపై కృతజ్ఞతలు తెలిపారు.

రాట్నాలమ్మకు విశేష పూజలు

పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి పూజా టిక్కెట్లపై రూ.16,855, విరాళాల రూపంలో రూ.8,296, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.25,210 మొత్తంగా రూ.50,361 ఆదాయం లభించినట్టు దేవస్థానం చైర్మన్‌ చల్లగొళ్ల వెంకటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు.

నేటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్‌ థియరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమ వారం నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో వాల్యూయేషన్‌ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న సంస్కృతం అధ్యాపకులను నియమించామని, ప్రిన్సిపాళ్లు తమ కళాశాల లాగిన్‌ను చూసి ఆయా అధ్యాపకులను రిలీవ్‌ చేయాలని ఆదేశించారు. సదరు అధ్యాపకులు మధ్యా హ్నం 12 గంటలకు ఏలూరులోని తమ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని సూచించారు. తొలుత సంస్కృతం పేపర్ల మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు.

నేడు నేపాల్‌ ఉప రాష్ట్రపతి రాక

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి (చినవెంకన్న) ఆలయాన్ని నేపాల్‌ ఉప రాష్ట్రపతి పరమానందజ్ఞ సోమ వారం సాయంత్రం సందర్శించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయన కారులో ఇక్కడకు రానున్నారు.

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement