కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మహిళా న్యా యవాదిపై దాడిని నిరసిస్తూ రాజమహేంద్రవరం బా ర్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులు గురువారం ధర్నా చేశా రు. మహిళా న్యాయవాది మాగాపు పద్మ తన కుమారుడి మోటార్ సైకిల్‌పై కోర్టు విధులకు వెళ్తున్నారు. ఆర్యాపురంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్‌కు సరిగ్గా నడపాలని హితవు పలికారు. ఆగ్రహించిన ఆటో డ్రైవర్ పద్మ, ఆమె కుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. మరికొందరు ఆటో డ్రైవర్లతో కలసి అసభ్యంగా మాట్లాడుతూ వారిపై దాడి చేశారు. పద్మ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు వెళ్లిన బార్ అసోసియేషన్ కార్యదర్శి పెళ్లూరి రమేష్, న్యాయవాదులపై కూడా ఆటో డ్రైవర్లు దాడికి ప్రయత్నించారు. వెంటనే న్యాయవాదులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేస్తామని సీఐ అప్పారావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు అల్లంపల్లి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి సీపీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


