రాజమహేంద్రవరం సిటీ: నోటికి వచ్చినట్లు కుసంస్కారంగా మాట్లాడుతున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని, అతనిపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో ఆయన కార్యాయలంలో మాట్లాడుతూ పంతం నానాజీ వ్యాఖ్యలు సభ్యసమాజం హర్షించే విధంగా లేవని, ప్రతీ ఒక్కరూ ఖండించాలని అన్నారు. కాపు నేతల సమావేశాన్ని చూసి వారు ఇటువంటి మాటలు మాట్లాడారా లేకపోతే ఎవరైనా మాట్లాడించారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే అయ్యుండి తాను వాడిన భాషను నానాజీ ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించాలని, ఒక రాజ్యాంగపరమైన బాధ్యతా యుతమైన వ్యక్తి సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడటం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పవన్‌ని డిమాండ్ చేస్తున్నామన్నారు.


