సమాజాన్ని జాగృతం చేసిన మహాకవి వేమన
సినీ దర్శక నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి
రావులపాలెం: రాజుగా జనరంజక పాలన సాగించడంతో పాటు తన కవితలతో సమాజాన్ని జాగృతం చేసిన మహాకవి యోగి వేమన అని సినీ దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి అన్నారు. రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద ఉన్న వేమన విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక రెడ్డి సంఘం పెద్దలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పార్కులోని వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వేమన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 500 మంది పేదలు, వృద్ధులకు దుప్పట్లు, బియ్యం నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం పెద్దలు సత్తి సూర్య భాస్కర రెడ్డి (చిన్న బుజ్జి), గొలుగూరి మునిరెడ్డి, తాడి నాగమోహన్‌రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, గొలుగూరి వెంకటరెడ్డి, పోతంశెట్టి కనికిరెడ్డి, కర్రి సత్తిరెడ్డి, కొవ్వూరి సుధాకరరెడ్డి, గొలుగూరి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేమన విగ్రహానికి నివాళులర్పిస్తున్న కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, రెడ్డి సంఘం పెద్దలు


