బెల్ట్‌ తీయండి | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ తీయండి

Jan 12 2026 7:30 AM | Updated on Jan 12 2026 7:30 AM

బెల్ట

బెల్ట్‌ తీయండి

బెల్ట్‌ షాపు తొలగించాలని డిమాండ్‌

కేఈ చిన్నాయిపాలెంలో

గ్రామస్తుల ఆందోళన

కోటనందూరు: బెల్ట్‌ షాపును తొలగించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి (ప్రచార విభాగం) లాలం బాబ్జీ ఆధ్వర్యాన కోటనందూరు మండలం కేఈ చిన్నాయిపాలెంలో గ్రామస్తులు ఆదివారం భారీ ఆందోళన చేపట్టారు. వందలాదిగా మహిళలు, వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో బెల్ట్‌ షాపు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. బెల్ట్‌ షాపులకు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెల్ట్‌ షాపు కారణంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, దీనిని తక్షణమే తొలగించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. అనేక ప్రాంతాల్లో సారా సైతం విక్రయిస్తున్నారని, పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులకు డబ్బులు చెల్లించి యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. కూలీనాలీ చేసుకునే తమ బడుగు జీవితాలు మద్యం మహమ్మరికి బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్జీ మాట్లాడుతూ, గ్రామంలో గుడి, బడులకు కూతవేటు దూరంలో అధికార పార్టీ నేతలకు కప్పం కట్టి మరీ బెల్ట్‌ షాపు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ మాదిరిగా దీనిని నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. గ్రామంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం, సారా విక్రయాలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు, ఎౖక్సైజ్‌ అధికారుల అండదండలతోనే బెల్ట్‌ షాపుల నిర్వహణ సాగుతోందని మండిపడ్డారు. ఈ బెల్ట్‌ షాపును తక్షణమే తొలగించకుంటే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

బెల్ట్‌ తీయండి1
1/1

బెల్ట్‌ తీయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement