నిబంధనలు గుర్తున్నాయా సర్‌! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు గుర్తున్నాయా సర్‌!

Nov 28 2026 12:08 AM | Updated on Nov 28 2026 12:08 AM

కొత్తపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలోని వానపల్లిలో అధికారులు జారీ చేసిన ఓటరు స్లిప్పులు వివాదానికి దారి తీస్తున్నాయి. సాధారణంగా ఓటరు స్లిప్పులపై ఓటరు పేరు, ఫొటో, పో లింగ్‌ కేంద్రం నంబరు, పోలింగ్‌ తేదీ, సమయం వంటి వివరాలు మాత్రమే ఉండాలి. కానీ, వానపల్లిలోని పలు వార్డుల్లో పంచిన స్లిప్పులపై ఎన్నికల గుర్తులు కత్తెర (సర్పంచ్‌ అభ్యర్థి గుర్తు), కుక్కర్‌ (వార్డు అభ్యర్థి గుర్తు) ముద్రించి ఉండటం చర్చనీయాంశంగా మా రింది. సంబందిత అధికారి డిజిటల్‌ సైన్‌తో జారీ చేసి న ఈ స్లిప్పుల ఎడమవైపు ఫొటో ఓటరు స్లిప్‌ రసీదు భాగంపై ఎన్నికల గుర్తులు ముద్రించి ఉన్నాయి. ఇలా గుర్తులతో ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడంపై స్థానిక ప్రత్యర్థి అభ్యర్థులు, వారి వర్గీయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి అధికారులు ఇలా గుర్తులతో ఓటరు స్లిప్పులు పంచితే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, స్లిప్పులపై గుర్తులు ఎవరు ముద్రించారు? కూటమి నేతల నిర్వాకమా? అధికారుల అనుమతి ఉందా? వంటి వాస్తవాలను వెల్లడించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement