మున్సిపల్‌ రాజకీయం.. రసవత్తరం | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ రాజకీయం.. రసవత్తరం

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

సాక్షి, అమలాపురం: జిల్లాలోని మూడు పురపాలక పీఠాలకు ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా మారింది. రెండు మున్సిపాలిటీలు, నగర పంచాయతీ చైర్మన్‌ పదవులకు ఏకంగా 24 నామినేషన్లు దాఖలు చేయడం రాజకీయాల్లో వేడి పెంచింది. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల చైర్మన్‌ పీఠాల కోసం అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా బరిలోకి దిగాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్ల ప్రక్రియలో చైర్మన్‌ పీఠాలకు భారీ పోటీ నెలకొంది. మొత్తం 91 వార్డులకు 477 నామినేషన్లు దాఖలయ్యాయి. అమలాపురంలో 180, రామచంద్రపురంలో 210, ముమ్మిడివరంలో 87 నామినేషన్లు వచ్చాయి. చైర్మన్‌ పదవులకు మొత్తం 24 పడగా, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఎంత మంది బరిలో నిలుస్తారో తేలనుంది.

ఎక్కడెక్కడ ఎంతెంత!

రామచంద్రపురంలో చైర్మన్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించగా పది నామినేషన్లు వచ్చాయి. ఇందులో వైఎస్సార్‌ సీపీ 3, టీడీపీ 4, బీఎస్పీ 1, కాంగ్రెస్‌ 1, జనసేన 1 ఉన్నాయి. ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా చైర్మన్‌ పదవి టీడీపీకి కేటాయించగా, జనసేన నుంచి ఒకరు నామినేషన్‌ దాఖలు చేయడం గమనార్హం. అలాగే 32 వార్డులకు మొత్తం నామినేషన్లు 210 పడ్డాయి. వైఎస్సార్‌ సీపీ నుంచి 101, టీడీపీ 63, జనసేన 35, బీజేపీ 8, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు.

ఫ అమలాపురంలో చైర్మన్‌ గిరిని జనరల్‌కు కేటాయించగా, ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌ సీపీ 2, జనసేన 2, బీఎస్సీ 1, కాంగ్రెస్‌ 1, ఆల్‌ ఇండియా వర్కర్స్‌ లేబర్‌ పార్టీ నుంచి 1 నామినేషన్లు దాఖలు చేశాయి. మొత్తం 36 వార్డులకు వైఎస్సార్‌ సీపీ 55, టీడీపీ 66, జనసేన 33, బీజేపీ 7, స్వతంత్రులు 19 మంది వేశారు.

ఫ ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్‌ పర్సన్‌ పీఠానికి 9 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌ సీపీ నుంచి 2, జనసేన 4, టీడీపీ 1, కాంగ్రెస్‌ 1, ఇతరులు ఒక నామినేషన్‌ ఉంది. మొత్తం 23 వార్డులకు వైఎస్సార్‌ సీపీ 40, టీడీపీ 34, జనసేన 3, బీజేపీ 3, సీపీఎం 1, ఇతరులు ఆరుగురు నామినేషన్లు వేశారు.

కూటమిలో రె‘బల్స్‌’

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలో రె‘బల్స్‌’ మోగుతున్నాయి. ఒకే పార్టీలోనూ.. మిత్రపక్షాలు ఒకే వార్డు నుంచి నామినేషన్లు వేయడం గమనార్హం. ఇక్కడ సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపిక పూర్తి గందరగోళంగా మారింది. ఆయా పార్టీలు ఎవరికి వారనట్టుగా వ్యవహరించారు. అమలాపురం మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులకు గాను టీడీపీ 22, జనసేన 12, బీజేపీ నుంచి రెండు చొప్పున పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే అమలాపురం ఆరో వార్డులో జనసేన నుంచి పిండి అమరావతి నామినేషన్‌ వేయగా, అదే కుటుంబం నుంచి జనసేన తరఫున పిండి అనుదీపికాదేవి కూడా నామినేషన్‌ వేయడం గమనార్హం. 12వ వార్డులో టీడీపీ నుంచి జంగా స్వర్ణకుమారి నామినేషన్‌ వేయగా, జనసేన నుంచి సూధాస్వర్ణ నామినేషన్‌ వేశారు. 24, 25 వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు నామినేషన్లు వేశాయి. కూటమిలో భాగమైన జనసేనకు ఇక్కడ నుంచి చైర్మన్‌గా పోటీ చేసే అవకాశం కల్పించారు. అయితే అభ్యర్థి లేకపోవడంతో టీడీపీ నుంచి అరువు తెచ్చుకుని బరిలోకి దించారు. టీడీపీకి చెందిన గుబ్బల దుర్గారత్న భవానీకి అప్పటికప్పుడు పార్టీ కండువా కప్పి పోటీలో ఉంచారు. ఇది సరిపోదన్నట్టుగా 23 వార్డులకు గాను కేవలం మూడు వార్డులకు మాత్రమే జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేయడం గమనార్హం. చైర్మన్‌తో పాటు వార్డు అభ్యర్థులు కూడా లేకపోవడం శోచనీయం.

ఫ ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

ఫ మూడు చైర్మన్‌ పీఠాలకు

24 మంది దాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement