వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా విరీతాదేవి నామినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా విరీతాదేవి నామినేషన్‌

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

అమలాపురం టౌన్‌: అమలాపురం మున్సిపల్‌ వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా దూడల వెంకట విరీతాదేవి ఆదివారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమెతో నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, పార్టీ నాయకులు నామినేషన్‌ దాఖలు చేయించారు. తొలుత విరీతాదేవి స్థానిక వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి పార్టీ నాయకులతో కలసి మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ వేశారు. ఆమెతో పాటు ఆమె భర్త, నియోజకవర్గ పార్టీ యువజన కమిటీ అధ్యక్షుడు దూడల ఫణి డమ్మీ నామినేషన్‌ వేశారు. డాక్టర్‌ శ్రీకాంత్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్యకుమార్‌ (అమలాపురం నియోజకకవర్గ పార్టీ పరిశీలకుడు), మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ తిక్కిరెడ్డి వెంకటేష్‌ తదితరుల సమక్షంలో విరీతాదేవి నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందించారు. అమలాపురం మున్సిపల్‌ జనసేన చైర్మన్‌ అభ్యర్థి నల్లా శ్రీధర్‌ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే బీఎస్పీ నుంచి బండి శ్రీను, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముషిణి సాయిలక్ష్మి నాగేంద్రమణి, రాష్ట్ర వర్కర్స్‌ ఆఫ్‌ ఇండియా పార్టీ తరఫున దేవాదుల సూర్యనారాయణమూర్తి నామినేషన్లు వేశారు.

నిబంధనలను పక్కనబెట్టి..

ఎన్నికల అధికారులు, పోలీసులు నామినేషన్‌ వేసే అభ్యర్థి వెంట ఇద్దరు లేకుంటే నలుగురిని అనుమతిస్తుంటే అదే జనసేన అభ్యర్థి శ్రీధర్‌ నామినేషన్‌ వేస్తున్నప్పుడు ఎన్నికల అధికారి గదిలోకి దాదాపు 100 మంది కూటమి నాయకులను ఎలా అనుమతించారని పలువురి ప్రశ్నిస్తున్నారు. అదే వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి విరీతాదేవి నామినేషన్‌ వేస్తున్నప్పుడు కేవలం నలుగురే నాయకులు ఉన్నారు. నిబంధనలకు గౌరవం ఇచ్చి వైఎస్సార్‌ సీపీ నాయకులు నలుగురికే పరిమితమై ఎన్నికల అధికారి గదిలోకి వచ్చారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై అనేక వైఎస్సార్‌ సీపీ నాయకులు ఉన్నప్పటికీ అధికారులు, పోలీసులు పెట్టిన ఆంక్షలకు విలువ ఇచ్చి ఆగిపోయారు. జనసేన అభ్యర్థి వంద మందితో ఎన్నికల అధికారి గదిలోకి రావడమే ఒక తప్పు అంటే నినాదాలు చేయడం మరో తప్పు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement