గోదావరిలోకి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ఐ.పోలవరం: మురమళ్ల వంతెనపై ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా స్థానిక జాలర్లు అతడిని రక్షించారు. వివరాల్లోకి వెళితే మండలం కేశనకుర్రు (చిన్న కేశనకుర్రు) పల్లెగూడెం గ్రామానికి చెందిన మల్లాడి శ్రీను కుటుంబ కలహాలతో మురమళ్ల వంతెన పై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గోదావరిలో కొట్టుకుపోతున్న అతడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీనును అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. శ్రీను భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు తెలిపారు.


