ఒక్క మాత్రతో నులిమేద్దాం! | - | Sakshi
Sakshi News home page

ఒక్క మాత్రతో నులిమేద్దాం!

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

● జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ పంపిణీ

● నేడు జాతీయ నులిపురుగుల

నిర్మూలన కార్యక్రమం

రాజమహేంద్రవరం రూరల్‌: పిల్లల ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్న నులిపురుగుల నివారణకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేసి జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నులి పురుగుల వల్ల కడుపులో నొప్పి, మంట, వికారం వంటి వాటితో అవస్థ పడుతూ పిల్లలు నీరసపడతారు. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లల్లో ఈ ఎదుగుదల, నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది.

అపరిశుభ్రతే కారణం..

అపరిశుభ్రత వల్లే నులి పురుగులు ఎక్కువగా వ్యాపిస్తాయి. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించని పిల్లలకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుషిత నీరు, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వల్ల, కూరగాయలు శుభ్రం చేయకుండా వండడం, ఆహార పదార్థాలపై మూతలు లేకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.

ఏడాది నుంచి రెండేళ్ల లోపు చిన్నారులకు అల్బెండజోల్‌ సగం మాత్ర (200 మిల్లీగ్రాములు) నీళ్లలో కలిపి పట్టించాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 400 మిల్లీ గ్రాముల మాత్రను మధ్యాహ్నాం భోజనమయ్యాక చప్పరించేలా చేడాలి. జిల్లాలో 4,46,865 మందికి ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నారు. సోమవారం వేయించుకోని వారికి వచ్చేనెల ఐదున మాత్రలను ఇవ్వనున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో, బడి బయట పిల్లలకు ఈ మాత్రలు పంపిణీ చేయనున్నారు.

స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రాంలో భాగంగా

రాష్ట్రీయ బాల స్వాస్థ్య ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో స్కూల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ చేస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం.

– డా.పి.కోమల,

డీఎంహెచ్‌వో, తూర్పుగోదావరి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement