మద్యం సీసాలతో సత్యదేవుని దర్శనానికి! | - | Sakshi
Sakshi News home page

మద్యం సీసాలతో సత్యదేవుని దర్శనానికి!

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

● హైదరాబాద్‌ నుంచి

వచ్చిన భక్తుల వాహనంలో గుర్తింపు

● మద్యాన్ని పారబోయించి

కొండపైకి పంపిన భద్రతా సిబ్బంది

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వెళ్తున్న వాహనంలో పెద్ద సంఖ్యలో మద్యాన్ని ఆదివారం టోల్‌గేట్‌ వద్ద స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెడితే హైదరాబాద్‌కు చెందిన భక్తుల బృందం టెంపోలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు. టోల్‌గేట్‌ వద్ద వారి వాహనాన్ని పరిశీలించిన భద్రతా సిబ్బంది తనిఖీ చేసి ప్రయాణికుల సీట్ల కింద దాచి ఉంచిన నాలుగు ఫుల్‌ బాటిల్‌ మద్యం సీసాలను గుర్తించారు. సీసాల్లోని మద్యాన్ని అక్కడి టబ్‌లో పారబోయాలని సూచించగా వారు సిబ్బందితో వాగ్వాదానికి దిగి సీసాలను స్వాధీనం చేసుకోండి తిరిగి వెళ్లేటపుడు తీసుకువెళ్తామని చెప్పారు. దీనికి సిబ్బంది అభ్యంతరం చెప్పగా తప్పని పరిస్థితుల్లో మద్యాన్ని పారబోసి రత్నగిరికి వెళ్లారు. వారు యానాంలో రూ.8 వేలకు ఆ మద్యాన్ని కొనుగోలు ట్రాన్స్‌పోర్టు విభాగం సూపరింటెండెంట్‌ రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement