స్మృతి ఆధారితమే స్మార్తం | - | Sakshi
Sakshi News home page

స్మృతి ఆధారితమే స్మార్తం

Sep 28 2026 12:41 AM | Updated on Sep 28 2026 12:41 AM

అమలాపురం టౌన్‌: స్మృతి (జ్ఞాపకం లేదా ధర్మ శాస్త్రాలు) ఆధారంగా వచ్చినదే స్మార్త విద్య అని మండలం పేరూరు శివారు విశ్వేశ్వర అగ్రహారానికి చెందిన స్మార్త పండితులు కర్రా భాస్కరావధానులు అన్నారు. శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శ్రీసత్యసాయి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన స్మార్తాగమ అపర విద్వత్సభలో ఆయన స్మార్త విద్య పరమార్ధాన్ని వివరించారు. ఆశ్వాలాయనాది మహర్షులు అందించిన గృహ్య సూత్రాల ప్రకారం స్మార్త విద్య కొనసాగుతోందని తెలిపారు. సభకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవస్థానం ఆస్థాన విద్యాంసుడు బ్రహ్మశ్రీ యావని వేంకట రామచంద్రసోమయాజి ఘనపాఠి అధ్యక్షత వహించి మాట్లాడుతూ వేదం ఎవరికై నా శిరోధార్యమని, స్మార్త విద్య అంటే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం గృహస్తులు ఆచరించాల్సిన నిత్య, నైమిత్తిక కర్మలు, పూజా విధానాలు తెలిపే వైదిక విద్య అని అన్నారు. బ్రహ్మశ్రీ శంకరమంచి శాంతి బాబు, బ్రహశ్రీ వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి, బహ్మశ్రీ బాదంపూడి ఫణిశర్మ, బ్రహ్మశ్రీ పాణంగిపల్లి సూర్యనారాయణాచార్యులు, పంచాంగ కర్త పిడపర్తి భాస్కర సుబ్రహ్మణ్య శాస్త్రి, ప్రయాగ కిషోర్‌శర్మ, గరిమెళ్ల విశ్వనాథశాస్త్రి సభా వేదికపై ఆశీనులై స్మార్త విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. విద్వత్సభ శ్రీకోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ అధ్యక్షుడు గుళ్లపల్లి ప్రభాకర ఫణి రాజా, కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్‌ ఆధ్వర్యంలో జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement