కొత్తపేట: స్థానిక చింతామణి గణపతి శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించిన ఆర్యవైశ్య సంఘ నాయకులను ముస్లిం సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఆర్యవైశ్య సంఘం నాయకుడు, ఉత్సవ కమిటీ చైర్మన్ యెండూరి పవన్‌కుమార్ తదితర ఆధ్వర్యంలో 9 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు స్థానిక కమ్మిరెడ్డిపాలెం జామియా మసీద్‌లో శుక్రవారం నమాజ్ తర్వాత మండల ముస్లిం, మైనార్టీ సంఘ నాయకుడు, కళాసాహితి సభ్యుడు షేక్ గౌస్, మసీదు, షాదీఖానా కమిటీ ప్రెసిడెంట్ షేక్ కాజాబాబు ఆధ్వర్యంలో యెండూరి పవన్‌కుమార్, ఆర్యవైశ్య సంఘ సభ్యుడు, సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కంకటాల సత్యనారాయణమూర్తి (కేఎస్‌ఎన్)ను ఘనంగా సత్కరించారు. కుల, మతాలు వేరైనా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిరు సత్కారం చేశామని వారన్నారు.


