చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ల మీద కేసులు పెడుతున్నారు. అదే వారికి అనుకూలంగా ప్రచారం చేస్తే డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఇదెక్కడి న్యాయం. ఇలాంటి విధానం ఏ రాష్ట్రంలోనూ లేదు.
–పోతురాజు బాబూరావు, గొల్లపాలెం, కాజులూరు మండలం
ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకే..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో టీడీపీ కార్యకర్తలకు ప్రజాధనం కట్టబెట్టే ప్రయత్నం దారుణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లను ముందుగా అర్హులకు అందించాలి. ప్రజలకు ప్రయోజనం లేని నిర్ణయాలను మానుకోవాలి.
– కాండ్రేగుల దుర్గ, అంబాజీపేట


