కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

Sep 22 2026 12:12 AM | Updated on Sep 22 2026 12:12 AM

చెంచు కులానికి చెందిన నేను కూలి పనులు చేసుకుంటూ ప్రభుత్వ, ప్రైవేటు ప్రాంతాల్లో చిన్నచిన్న గుడారాలు వేసుకుంటూ జీవిస్తున్నాం. మా పిల్లలు ముమ్మిడివరం నగర పంచాయితీలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్నారు. వారికి సంబంధించిన రికార్డులు, టీసీల్లో ఎస్టీ, ఉపకులం చెంచులుగా రికార్డు చేసి ఇచ్చారు. కానీ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మమ్మల్ని షెడ్యూల్డ్‌ ట్రైబ్‌(ఎస్టీ)గా గుర్తిస్తూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు వివిధ మండలాల్లో తహసీల్దార్లు నిరాకరిస్తున్నారు. దీంతో, మా పిల్లల ఉన్నత చదువులు, స్కాలర్‌షిప్‌, ప్రభుత్వ సంక్షేమ పథకాల వంటి వాటికి దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బంది అవుతోంది. దీనిపై డీఆర్‌ఓకు ఫిర్యాదు చేశాం.

– అవుల మరియమ్మ, ముమ్మిడివరం నగర పంచాయతీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement