భారీ వర్షం.. రోడ్లు జలమయం | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షం.. రోడ్లు జలమయం

Sep 21 2026 12:14 AM | Updated on Sep 21 2026 12:14 AM

అమలాపురం టౌన్‌ : రవణం వీధిలోని శ్రీ సర్వమంగళ ఆలయంలోకి ప్రవేశించిన వర్షపు నీరు

అమలాపురం టౌన్‌ : మెయిన్‌ రోడ్డుపై నిలిచిపోయిన వర్షం నీరు

అమలాపురం, అంబాజీపేట మండలాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు కాలనీలు, వీధులు జలమయమయ్యాయి. పలు ఇళ్లు, ఆలయాల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది.

అమలాపురంలో మున్సిపల్‌ కమిషనర్‌ వి.నిర్మల్‌కుమార్‌ పట్టణంలో ముంపునకు గురైన వీధుల్లో డ్రెయిన్లు త్వరగా లాగేలా సిబ్బందితో చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు అంబాజీపేట మండలంలోని కొబ్బరి, కోకో, అరటి, కూరపాదులు నీట మునిగాయి. – అమలాపురం టౌన్‌/ అంబాజీపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement