జస్టిస్ బులుసు శివశంకర్
అమలాపురం రూరల్: కోనసీమలో అనాదిగా వేదం పరిఢవిల్లుతోందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లయింట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ బులుసు శివశంకర్ అన్నారు. మండలంలోని సాకుర్రు గ్రామంలో రాణి హయగ్రీవ అవధాని వేద శాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేద శాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో గుల్లపల్లి దత్తాత్రేయ ఘనాపాటి అధ్యక్షతన శనివారం నిర్వహించిన వార్షిక వేద సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసగించారు.
కోనసీమ వేదాలకు పుట్టినిల్లని, అటువంటి సీమలో వేద శాస్త్ర పరిషత్తులు సభలు నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని చెప్పారు. గోదావరి జిల్లా నుంచి వేద పండితులు అధిక సంఖ్యలో పాల్గొని వేద స్వస్తి నిర్వహిచారు. విశ్వనాథ గోపాలకృష్ణ ఘనాపాటి, వడ్లమాని సుబ్రమణ్య ఘనాపాటి, దువ్వూరి ప్రకాశ అవధానులు, తిరుమల తిరుపతి దేవస్థానం పండితుడు చిన్న ఆంజనేయ ఘనాపాటి ప్రసం గించారు. ఈ సందర్భంగా శతాధిక స్మార్త పండితుడు గరిమెళ్ళ విశ్వనాథంను సత్కరించారు.


