జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీగా గణేష్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీగా గణేష్‌కుమార్‌

Sep 19 2026 12:16 AM | Updated on Sep 19 2026 12:16 AM

అమలాపురం టౌన్‌: జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) సెక్రటరీగా అమలాపురం జెడ్పీ బాలుర హైస్కూలు వ్యాయామ ఉపాధ్యాయుడు కామన గణేష్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం నుంచి ఆయనకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. క్రీడా రంగంలో 30 సంవత్సరాల అనుభవంతో విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం అభివృద్ధికి చేస్తున్న కృషిని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఏడాది పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. జిల్లాలోని పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసి వివిధ పోటీలను సమర్ధవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. పాఠశాల హెచ్‌ఎం షేక్‌ అలీ, పీఈటీలు తోట రవి, పరమట ప్రసాద్‌, సిబ్బంది శుక్రవారం ఆయన్ని అభినందించారు.

బోధనేతర యాప్‌ల

భారం తగ్గించాలి

డీఈవోకు ఆప్టా జిల్లా అధ్యక్షుడి వినతి

అమలాపురం టౌన్‌: ఉపాధ్యాయులకు బోధనేతర యాప్‌ల భారం తగ్గించాలని, పలు రకాల ప్రభుత్వ పోర్టళ్లతో రోజూ డేటా ఎంట్రీ, వీడియోలు, సర్టిఫికెట్ల భారం వల్ల పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందని ఏపీపీటీఏ (ఆప్టా) జిల్లా సంఘ అధ్యక్షుడు షబ్బీర్‌ హుస్సేన్‌.. అమలాపురంలోని డీవైఈవో కార్యాలయంలో డీఈవో ఎస్‌కే మహబూబ్‌ బాషా, జిల్లా సమగ్ర శిక్షా ఏపీసీ జి.మమ్మీలకు వినతి పత్రం అందించారు. యుడైస్‌లో వేరియేషన్స్‌ వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని సరళీకృతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులు సక్రమంగా, సకాలంలో విడుదల చేయాలని అభ్యర్థించారు.

రేపు వైఎస్సార్‌ సీపీ

బీసీ సెల్‌ జిల్లా సమావేశం

అమలాపురం టౌన్‌: వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా సమావేశం అమలాపురంలో ఆదివారం సాయంత్రం జరగనుందని ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర శుక్రవారం తెలిపారు. కోనసీమ జిల్లా ఏర్పడిన తరువాత జరిగే బీసీ సెల్‌ తొలి సమావేశం ఇదేనని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ నౌడు వెంకటరమణ, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మాజీ మంత్రి, తూర్పుగోదావరి పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. పార్టీ జిల్లా బీసీ సెల్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

విమాన ఇంధన ప్రాజెక్టుపై

ప్రహసనంగా పబ్లిక్‌ గ్రీవెన్స్‌

కాకినాడ రూరల్‌: కాకినాడ యాంకరేజ్‌ పోర్టు సమీపంలో ప్రతిపాదించిన సుస్థిర విమాన ఇంధన ప్రాజెక్టుపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రహసనంగా మారిందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక రైతులకు, మత్స్యకారులకు తీర ప్రాంత నగర గ్రామీణ ప్రజలకు పత్రికా ముఖంగా కనీస సమాచారం ఇవ్వకుండా, నోటిఫికేషన్‌ వివరాలను గోప్యంగా ఉంచి నిర్వహించిన ఈ సేకరణ చట్టవిరుద్ధమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌, ప్రముఖ సామాజిక వేత్త రమణరాజు దుయ్యబట్టారు. దీనిపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ కాలుష్య నియంత్రణ ఉన్నతాధికారులకు, సుప్రీంకోర్టుకు లేఖ పంపినట్టు తెలిపారు. లోపభూయిష్టంగా జరిగిన నిన్నటి సమావేశాన్ని రద్దు చేసి, స్థానిక భాషలో పూర్తి నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచి తక్షణమే ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. అత్యంత సున్నితమైన కాకినాడ తీర ప్రాంతంలో వందలాది ఎకరాల మడ అడవులు, సముద్ర జీవ వైవిధ్యం, సీఆర్‌జెడ్‌ పరిధిని ఈ ప్లాంట్‌ తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ విధ్వంసం వల్ల మత్స్యకారుల జీవనోపాధి, తాగునీటి భద్రత పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో తీరప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ఇచ్చే ప్రాధాన్యతపై కంపెనీ యాజమాన్యం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement