అమలాపురం రూరల్: జిల్లాలో పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ వైఖోమ్ నిడియా దేవి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డీపీవో, డీఎల్‌డీవోలతో శుక్రవారం ఆమె కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పింఛన్ల కోసం మొత్తం 38,598 దరఖాస్తులు అందినట్టు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. నిర్దేశిత గడువులోగా క్షేత్రస్థాయిలో వాటి పరిశీలన ప్రక్రియ పూర్తిచేయాలని చెప్పారు. ఎకై ్సజ్, మత్స్య, చేనేత తదితర శాఖలకు సంబంధించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు పరిశీలించాలన్నారు. వెల్ఫేర్ అసి స్టెంట్లు, వార్డు సెక్రటరీల లాగిన్లలో ఉన్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ దరఖాస్తులను ఈ నెల 21 నాటికి తప్పనిసరిగా పరిశీలించి తదుపరి లాగిన్లకు పంపించాలని ఆదేశించారు. అక్టోబర్ రెండో తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి మూడో శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ రాంబాబు, డీపీవో శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్


