పి.గన్నవరం టీడీపీలో
మళ్లీ రాజుకున్న విభేదాలు..
ఇప్పుడు ఆనందసాగర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు దాదాపు ఖరారయ్యాయనే ప్రచారంతో మళ్లీ విభేదాలు రాజుకుంటున్నాయి. పార్టీ సీనియర్లు జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, సీనియర్లు డొక్కా నాథ్‌బాబు, నాగాబత్తుల సుబ్బారావు వంటి వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. బాబు పర్యటనలో పాస్‌ల కేటాయింపులోనూ తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు పార్టీ అధ్యక్షులు రాజీనామాల వరకు వెళ్లినట్టు సమాచారం. చంద్రబాబు పర్యటనతో కేడర్‌లో జోష్ రావాల్సిన సమయంలో ఈ పరిణామాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
ఇటీవల జరిగిన చంద్రబాబు జిల్లా పర్యటన పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీలో కొత్త విభేదాలకు దారితీసింది. ఇంతవరకు పార్టీలో అంతర్గతంగా ఉన్న ఆధిపత్య పోరు కాస్తా మరింత ముదిరి రాజీనామాల వరకు వెళ్లింది.
సాక్షి, అమలాపురం: పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాల టీడీపీ అధ్యక్షులు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి, గూడాల ఫణి, వస్కా శ్యామ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ కో కన్వీనర్లుగా ఉన్న మోకా ఆనందసాగర్, దాసరి వీరవెంకట సత్యనారాయణలతో కలిసి పనిచేయలేమని, కార్యకర్తలకు తీవ్ర అవమానం జరుగుతోందని చెబుతూ తమ రాజీనామా లేఖలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ల శ్రీనివాస్‌కు పంపారు. మరీ ముఖ్యంగా కో కన్వీనర్‌గానే కాకుండా రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న ఆనందసాగర్ తీరుతో తాము తీవ్ర అవమానాలకు గురవుతున్నామని వారు పేర్కొన్నారు. ఒకేసారి ముగ్గురు మండల అధ్యక్షుల రాజీనామా అస్త్రం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మరోపక్క అమలాపురం ఎంపీ గంటి హరీష్‌కు కూడా వారు లేఖ రాశారు. దీనిపై ఆయన విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి దృష్టికి తీసుకెళ్లారు. సాయి మాట్లాడిన తరువాత రాజీనామా వ్యవహారం బయటకు పడకుండా ఉండేలా తాము రాజీనామాలు చేయలేదని, తమ అసంతృప్తిని మాత్రం లేఖ రూపంలో పార్టీ పెద్దలకు వివరించామని మండల అధ్యక్షులు చెబుతున్నారు.
ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయన నియోజకవర్గ పార్టీ నేతలతో అంబాజీపేటలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీలో అందరూ ఒక మాటపై పనిచేయాలని సూచించారు. అయితే బాబు పర్యటనలో హెలీప్యాడ్ వద్ద, రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ వద్ద, కార్యకర్తల సమీక్ష సమావేశాలకు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇవ్వాల్సిన పాస్‌లు ఆనందసాగర్ తనకు నచ్చినవారికి ఇవ్వడం, పార్టీ మండల అధ్యక్షులను, ఇతర నాయకులను పట్టించుకోకపోవడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇది తమకు అవమానంగా భావించి వారు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు.
అదే అసంతృప్తికి
కారణమా?
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాల్సిన సమయంలో పి.గన్నవరం నియోజకవర్గ టీడీపీలో విభేదాలు బయటపడుతున్నాయి. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా స్థానికేతరుడైన ఆనందసాగర్‌ను ఖరారు చేశారనే ప్రచారం కేడర్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో కో–కన్వీనర్ల జోక్యం పెరగడం, సీనియర్ కార్యకర్తలను పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే బాటలో మరికొందరు కీలక నాయకులు కూడా పయనించనున్నారనే ప్రచారం పార్టీ కేడర్‌లో ఆందోళనకు కారణమవుతోంది.
తొలి నుంచీ వ్యతిరేకత
ఆనందసాగర్‌కు ఇన్‌చార్జి పదవిని నాలుగు మండలాల పార్టీ కేడర్‌తో పాటు సాధారణ కార్యకర్తలు కూడా తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి స్థానికులకే ఇన్‌చార్జి పదవి ఇవ్వాలనే తీర్మానాలు చేసి పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే 2019 ఎన్నికల తర్వాత కొంతకాలం పి.గన్నవరం నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి లేకుండా పోయారని గుర్తుచేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి సరిపెళ్ల రాజేష్ (మహాసేన రాజేష్)ను అభ్యర్థిగా ఎంపిక చేసిన సమయంలోనూ స్థానికేతరుడు, వివాదాస్పద వ్యక్తి అంటూ కేడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పార్టీ కార్యాలయం ధ్వంసం వరకు వెళ్లింది. ఈ పరిణామాలతో అభ్యర్థిని మార్చడంతో పాటు ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే.
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
ముగ్గురు మండల అధ్యక్షుల
రాజీనామా బెదిరింపు
అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖాస్త్రం
కోకన్వీనర్లతో కలసి
పనిచేయలేమంటూ లేఖలు
విభేదాలు రాజేసిన చంద్రబాబు పర్యటన
ఆనందసాగర్‌కు ఇన్‌చార్జి పదవి
నేపథ్యంలో తిరుగుబాటు


