ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ధ్వజం
అమలాపురం టౌన్: ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు చేస్తున్నా రని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు విమర్శించారు. కోనసీమ పర్యటన కు వచ్చిన సీఎం చంద్రబాబు అంబాజీపేటలో మ ద్యం అధిక ధరలపై మొక్కుబడి ప్రకటనలకే పరిమితమయ్యారని, అడ్డుకునేందుకు ఆచరణలో చేపట్టిన చర్యలు శూన్యమని తెలిపారు. బాబు వెళ్లిన సాయంత్రం నుంచే మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు యథావిధిగా విక్రయాలు చేయడమే దీనికి నిదర్శనమన్నారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం సిండికేట్లు, అధికారులు కుమ్మకై ్క ధరలు పెంచి అనధికార దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. మరోపక్క యానాం నుంచి మద్యం, పెట్రోలు, డీజిల్ కోనసీమకు అక్రమంగా రవాణా యథేచ్ఛగా సాగుతున్నా సంబంధిత శాఖలకు, అధికారులకు పట్టడం లేదన్నారు. ఇసుక దందా కూడా కోనసీమలో అధికమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండిగో సర్వీసు అత్యవసర ల్యాండింగ్
కోరుకొండ: చైన్నె నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన ఇండిగో విమాన సర్వీ సు శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి సిగ్నల్ రాకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టి వెనుదిరిగింది. ఇదిలా ఉండగా 65 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో స్థానికులు ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు.


