ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రద్దు చేయాలని నిరసన

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

మామిడికుదురు: ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో మామిడికుదురు జెడ్పీ హైస్కూల్‌ వద్ద ఉపాధ్యాయులు శనివారం నిరసన తెలిపారు. సెప్టెంబరు మూడో తేదీన నిర్వహించతలపెట్టిన చలో విజయవాడ కరపత్రాలనుచీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. టెట్‌ పరీక్షకు అర్హత మార్కులు తగ్గించాలని, ఆఫ్‌లైన్‌లోనే టెట్‌ నిర్వహించాలని, ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుల్లో మాత్రమే పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి చెల్లుబోయిన కేశవరావు, మండల అధ్యక్షుడు జి.నాగేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ఎంఎన్‌ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్‌ కె.అరుణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

నన్ను ఎవరో వెంటాడుతున్నారు

హత్యకు గురైన సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ

కాకినాడ క్రైం: కాకినాడ భానుగుడి జంక్షన్‌లో దారుణ హత్యకు గురైన సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు గడచిన మూడు రోజులుగా తనను వెంటాడుతున్నారని శనివారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తాను శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చోట మీడియా ప్రతినిధులతో కలిసిపోయి ఒక మహిళ, ఒక పురుషుడు తన ఫొటోలు, వీడియోలు తీసుకున్నారన్నారు. వారిద్దరూ శనివారం తన ఇంటి చుట్టూ తిరుగుతూ రెక్కీ నిర్వహించారని జయశ్రీ తెలిపారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు తనతో మాట్లాడి సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులు కేసు నమోదులో సహకరిస్తారని చెప్పారని వివరించారు. ఈ హత్య విషయంలో కటౌట్‌ శ్రీనుపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఆమె పోలీస్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఎస్పీని కలవనున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement