విశ్రాంత హైకోర్డు న్యాయమూర్తి
జస్టిస్ శివశంకర్
అమలాపురం రూరల్: న్యాయవాదులు చట్టాల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలని విశ్రాంత హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ బొలుసు శివశంకర్ అన్నారు. ‘ఆస్తి చట్టాలు–2018 సవరించబడిన స్పెసిఫిక్ రిలీఫ్ చట్టంపై ప్రత్యేక ప్రస్తావన’ అనే అంశంపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో సి.పద్మనాభరెడ్డి సెమినార్ హాల్‌లో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆస్తి చట్టాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ వివరించారు. చట్ట సవరణలు, తీర్పుల పట్ల న్యాయవాదులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు న్యాయం అందించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జస్టిస్ బొలుసు శివశంకర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అజామ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, బార్ కౌన్సిల్ సభ్యుడు సీహెచ్ అజయ్ కుమార్, ముప్పాళ్ళ సుబ్బారావు, సీనియర్ న్యాయవాది కూచిమంచి మళ్ళపరాజు, కె.శశిధర్ శ్రీరాం, అబ్బిరెడ్డి సురేష్, నల్లా ప్రభాకర్, నంబూరి మూర్తి, హమీద్ పాషా, బడుగు భాస్కర్ జోగేష్, మణి, లావణ్య, బ్లెస్సీ సాయి, యు.లక్ష్మణరావు, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు.


