ఆకట్టుకుంటున్న ‘గంట మందారం’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘గంట మందారం’

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

కొత్తపేట: సాధారణంగా మందార పువ్వు పైకి లేదా పక్కకు విడుస్తుంది కానీ ఈ మందారం తల కిందకి దించి గంట ఆకారంలో ఉంటుంది. అందుకే దాన్ని గంట మందారం పిలుస్తారు. స్థానిక కమ్మిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలు, నర్సరీల నుంచి రకరకాల మొక్కలు తెచ్చి తన ఇంటి పెరట్లో పెంచుతుంటారు. కడియపులంకలో ఒక నర్సరీ నుంచి రామం నెల క్రితం గంట మందారం మొక్కను తెచ్చి పాతారు. దానికి రెండు రోజుల క్రితం మొగ్గ పూసింది. అది బుధవారం పుష్పంగా విడిచిందని రామం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement