అమలాపురం టౌన్: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ, అన్న సమారాధన స్థానిక గడియారం స్తంభం సెంటర్‌లో ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కాపు రిజర్వేషన్ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి తెలిపారు. స్థానిక రాతి బడి వద్ద గురువారం జరిగిన జిల్లా కాపు ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు నాయకులు, ముద్రగడ అభిమానులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. సంస్మరణ సభ, అన్న సమారాధన ఏర్పాట్లపై కాపు నాయకులు చర్చించారు. విష్ణుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, నల్లా పవన్ కుమార్, సూదా గణపతి, నల్లా స్వామి, కర్రి రాఘవ, నల్లా అజయ్, నల్లా సంజయ్, కల్వకొలను ఉమ, చిక్కం కిట్టు, కంచిపల్లి అబ్బులు, బోణం సత్య వరప్రసాద్, పత్తి దత్తుడు, మామిడిపల్లి రాము, రంకిరెడ్డి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముద్రగడకు జోహార్లు అర్పించారు.


