అమలాపురం టౌన్: మున్సిపాలిటీ పరిధి పేరమ్మ అగ్రహారంలోని ఆచార్య వినోభాభావే మున్సిపల్ ప్రా థమిక పాఠశాల ఒకే ఒక్క విద్యార్థితో కొనసాగుతోందంటూ ‘మూతబడులు’ శీర్షికన ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యా శాఖ అధికారులు స్పందించారు. ఈ ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న బండారు అద్విత్‌ను అతడి సోదరి కీర్తన మూడో తరగతి చదువుతున్న స్థానిక సూర్య నగర్‌లోని గోపాలకృష్ణ గోఖలే మున్సిపల్ ప్రాథమిక పాఠశాల(మోడల్ స్కూలు)లో గురువారం చేర్చారు. పేరమ్మ అగ్రహారం పాఠశాల టీచర్ సత్యకుమార్‌ను భూపయ్య అగ్రహారం పాఠశాలలో డెప్యూటేషన్‌పై నియమించారు.


