చిట్టీల పేరుతో మోసం | - | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో మోసం

Jul 23 2026 1:18 AM | Updated on Jul 23 2026 1:18 AM

పోలీసులకు బాధితుల ఫిర్యాదు

నిడదవోలు: చీటీల పేరుతో ప్రజలను మోసం చేసిన ఓ మహిళపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని గౌడవీధికి చెందిన మెరకనపల్లి తిరుమల అనే మహిళ 8 ఏళ్లుగా చీటీలు వేస్తోంది. ఆ నమ్మకంతో తన వద్ద చిట్టీలు వేసిన 70 మందికి చెందిన రూ.90 లక్షలతో ఈనెల 18 తేదీ నుంచి ఆమె కనపడకుండా పోయింది. బాఽధితులకు అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి ఆమె భర్త వెంకటరమణను అడగగా తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రులకు

కుమారుడి అప్పగింత

పశ్చిమ బెంగాల్‌ నుంచి

తప్పిపోయి వచ్చిన యువకుడు

హృదయాలయంలో ఆశ్రయం

నిడదవోలు: స్థానిక సహాయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హృదయాలయం మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో ఆటిజంతో బాధ పడుతున్న 18 ఏళ్ల యువకుడిని బుధవారం నిర్వాహకులు అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్‌ వర్ధమాన జిల్లా దబిపూర్‌ గ్రామం నుంచి కింగ్‌షుక్‌ అనే యువకుడు గతనెల 22న రాజమహేంద్రవరం వచ్చాడు. అతడిని రాజమండ్రి చైల్డ్‌ వేల్ఫేర్‌ కమిటీ ఇక్కడి మానసిక దివ్యాంగుల కేంద్రానికి పంపించారు. అప్పటి నుంచి అతడి చిరునామా తెలుసుకునేందుకు ప్రయత్నించి ఎట్టకేలకు తల్లిదండ్రుల కాంటాక్టు నంబరు తెలుసుకుని వారికి సమాచారం ఇచ్చారు. అతడి తల్లిదండ్రులు కృష్ణందీ మెడక్‌, రాఖీ మెడక్‌ బుధవారం హృదయాలయానికి చేరుకోగా అధికారుల సమక్షంలో వారి కుమారుడిని అప్పగించినట్టు నిర్వాహకులు దండే గణేష్‌ బాబు, ఎడ్యుకేటర్‌ బలగం విశాలాక్షి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement