హామీల విస్మరణ ం | - | Sakshi
Sakshi News home page

హామీల విస్మరణ ం

May 6 2026 8:13 AM | Updated on May 6 2026 8:13 AM

ఇవీ డిమాండ్లు

ఫ సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి.

ఫ అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని

కాంట్ట్రాక్టు పద్ధతిలోకి మార్చాలి.

ఫ రాజ్యాంగ పరంగా పౌరుల హక్కుగా ఉన్న

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.

ఫ హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి.

ఫ మినిమమ్‌ టైం స్కేల్‌, ఇంటి అద్దె,

కరవు భత్యం ఇవ్వాలి.

ఫ రూ.10 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌, గ్రాట్యుటీ, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలి.

ఫ ఉద్యోగ విరమణ వయస్సును

62 ఏళ్లకు పెంచాలి.

ఫ వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవులు ఇవ్వాలి.

ఫ మరణించిన ఉద్యోగి కుటుంబానికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.20 లక్షలకు పెంచాలి.

ఫ కారుణ్య నియామకాలు చేపట్టాలి.

ఫ డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో

సమగ్ర శిక్ష ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలి.

కపిలేశ్వరపురం: ప్రభుత్వ బడి నిర్మాణం, నిర్వహణ, విద్యా బోధన, చిన్నారుల ఆలనా పాలన, ఉపాధ్యాయులకు చేయూత.. ఇలా అనేక విధులు నిర్వహిస్తూ విద్యా శాఖ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు. సంఖ్య రీత్యా తక్కువగానే ఉన్నప్పటికీ విద్యా శాఖ కార్యకలాపాలు అనేకం వీరి సేవలతోనే కొనసాగుతున్నాయి. అటువంటి ఈ ఉద్యోగులు ఏళ్ల తరబడి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వానికి వివరించి, సుమారు రెండేళ్లవుతోంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ, విద్యా శాఖ మంత్రి లోకేష్‌ కానీ వారి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో, తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు.

సమగ్ర శిక్ష ఉద్యోగుల సేవలివీ..

మండల మానవ వనరుల కేంద్రం నిర్వహణలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలకంగా ఉంటారు. మొత్తం కార్యకలాపాలకు సమన్వయకర్తగా మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌) కో ఆర్డినేటర్‌ వ్యవహరిస్తారు. క్లస్టర్‌ పరిధిలోని పాఠశాలల నిర్వహణను క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ (సీఆర్‌పీ) పర్యవేక్షిస్తారు. మండల వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ) కార్యాలయ నిర్వహణకు సహాయకారిగా మెసెంజర్‌ ఉపకరిస్తారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు తోడ్పాటుగా ఇంక్లూజివ్‌ ఎడ్యుకేషన్‌ రిసోర్స్‌ టీచర్స్‌ (ఐఈఆర్‌టీ) నిలుస్తారు. వారికి కేర్‌వింగ్‌ వలంటీర్లు సహాయకులుగా ఉంటారు. పాఠశాలల్లో క్రాఫ్ట్‌, పీఈటీ తదితర విధుల నిర్వహణలో పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు సేవలందిస్తారు. సమగ్ర శిక్ష భవనాల నిర్మాణ వ్యవహారాలను జిల్లా కేంద్రంలో ఉండే సైట్‌ ఇంజినీర్‌ పర్యవేక్షిస్తారు. ఇన్ని విధాలుగా సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విసిగి వేసారి..

ప్రస్తుత విద్యా శాఖ మంత్రి లోకేష్‌ గతంలో యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారి డిమాండ్లను విస్మరించారు. మినిమమ్‌ టైం స్కేల్‌ ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును సైతం చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాల పెంపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తానంటూ బడ్జెట్‌ సమావేశాల్లో చెప్పి, రాష్ట్రం ప్రభుత్వ బాధ్యతను విస్మరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విసిగి వేసారిన సమగ్ర శిక్ష ఉద్యోగులు కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఆధ్వర్యాన ఉద్యమించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర నలుమూలల నుంచీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 15న విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్‌ ఇంటికి పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ దిశగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు కదులుతున్నారు.

·˘ çÜÐ]l${VýS Õ„ýS E§øÅVýS$ÌS ´ùÆý‡$»êr

·˘ ÐéÇ çÜÐ]l$çÜÅÌS

పరిష్కారానికి గతంలో లోకేష్‌ హామీ

·˘ Æð‡…yólâýæÏÐ]l#™èl$¯é² çܵ…¨…^èl° {糿¶æ$™èlÓ…

·˘ yìlÐ]l*…yýlÏ Ýë«§ýl¯]lMýS$ çÜMýS$r$…º E§ýlÅÐ]l$…

·˘ Ðól$ 15¯]l Ð]l$…{† ÌZMóS‹Ù

ఇంటికి పాదయాత్ర

·˘ EÐ]l$Ãyìl hÌêÏÌZ

ఆ దిశగా కదులుతున్న సిబ్బంది

సమస్యలు పరిష్కరించాలి

సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డిమాండ్లన్నీ రాజ్యాంగబద్ధమైనవి. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనే మేము అడుగుతున్నాం. కూటమి ఐదేళ్ల పాలనా కాలంలో రెండేళ్లు గడిచిపోతున్నా మా డిమాండ్లను పట్టించుకోవడం లేదు. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

– నూకపెయ్యి గంగాధర్‌, రాష్ట్ర కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యుడు, ఉప్పలగుప్తం

Advertisement
 
Advertisement
Advertisement