విజ్ఞానంతో ముడిపడి | - | Sakshi
Sakshi News home page

విజ్ఞానంతో ముడిపడి

Feb 28 2026 7:34 AM | Updated on Feb 28 2026 7:34 AM

విజ్ఞ

విజ్ఞానంతో ముడిపడి

u

గతమెంతో ఘనం

గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యలో సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ అమలు చేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు నిర్వహించడంతో పాటు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. కోనసీమ జిల్లాలో 2022–23లో 4,561 మంది విద్యార్థులు, 2,478 మంది ఉపాధ్యాయులకు, 2023–24లో 13,340 మంది విద్యార్థులకు ట్యాబ్‌లను ఇచ్చారు. 2022–23లో 191 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 264 స్మార్ట్‌ టీవీలు, 142 ఉన్నత పాఠశాలలకు 951 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌ ఇచ్చారు. 2023–24లో 517 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 558 స్మార్ట్‌ టీవీలు, 197 ఉన్నత పాఠశాలలకు 873 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ప్యానల్స్‌ అందజేశారు.

జాతీయ సైన్స్‌

దినోత్సవం నేపథ్యం

నోబెల్‌ పురస్కార గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట్రామన్‌ (సీవీ రామన్‌) కాంతిపై ‘రామన్‌ ఎఫెక్ట్‌’ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28. ఆ రోజును జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని కలిగించాలన్నది జాతీయ సైన్స్‌ దినోత్సవ ప్రధాన ఉద్దేశం.

ఉమ్మడి జిల్లాలో

విస్తారంగా సైన్స్‌ ప్రచార సేవా సంస్థలు

చంద్రయాన్‌–3 విజయంలో

వల్లూరివాసి సహకారం

నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం

కపిలేశ్వరపురం: శాస్త్ర విజ్ఞానం.. అదో అద్భుతం. మానవాళికి మార్గదర్శకం.. ఆధునిక కాలమంతా సాంకేతికమయం.. ప్రయోగాలు, పరిశోధనలే కాదు సామాన్యుడి రోజువారీ జీవితం సైన్స్‌తో ముడిపడింది. మానవాళి అభ్యున్నతికి అది ఎంతగానో దోహదపడుతోంది. గతకాలపు అజ్ఞానాన్ని వీడి ఆధునిక మానవ అవసరాలు ప్రాతిపదికగా సైన్స్‌ దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా సాంకేతిక విద్యా సంస్థలు, సైన్స్‌ ప్రచార సేవా సంస్థలు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

శాస్త్ర సాంకేతిక ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లాకు మంచి పేరు ఉంది. ఇక్కడి నుంచి ఎందరో శాస్త్రవేత్తలు పేరు ప్రఖ్యాతలు సాధించారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఇండియన్‌ ఎలక్ట్రో ఆప్టికల్‌ ఇంజినీర్‌ వేగుళ్ల కోటేశ్వరరావు సైన్స్‌ అభ్యున్నతికి విశేష కృషి చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సైతం ఇస్రో సంస్థ ఆయన సూచనలు, సలహాలను స్వీకరించింది. వల్లూరులో పాఠశాల విద్య, మండపేటలో ఇంటర్మీడియట్‌, కాకినాడ జేఎన్‌టీయూకేలో ఇంజినీరింగ్‌, బెంగళూరులో పీహెచ్‌డీ చేశారు. ఇస్రోలో చేరి శాసీ్త్రయ ప్రయోగాల్లో తనదైన శైలిలో సేవలందించారు. బెంగళూరులోని ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లో 1978–83 మధ్యకాలంలో ఇంజినీర్‌గా పనిచేశారు. 2023 జూలై 14న భారత చంద్రయాన్‌– 3 అంతరిక్ష ప్రయోగంలో శాస్త్రవేత్తల బృందానికి కోటేశ్వరరావు సూచనలు, సలహాలు ఇస్తూ విజయవంతానికి కృషి చేశారు.

సైన్స్‌ ప్రచార సేవా సంస్థలు ఇలా..

మానవుల్లో విజ్ఞాన వికాసాన్ని పెంచేందుకు పలువురు మేథావులు 1988 ఫిబ్రవరి 28న స్థాపించిన జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి జిల్లాలో సైన్స్‌ ప్రచారానికి కృషి చేస్తోంది. విద్యార్థి చెకుముఖి పేరుతో 1990 డిసెంబర్‌ నుంచి సైన్స్‌ మాస పత్రికను, 2010 నుంచి చెకుముఖి సైన్స్‌ సంబరాలను నిర్వహిస్తోంది. కాకినాడ జేఎన్‌టీయూ వేదికగా 2025 డిసెంబర్‌ 21 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహించి శాస్త్రవేత్తలతో విద్యార్థులను మమేకం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి 54 బృందాలుగా 162 మంది విద్యార్థులు, 150 మంది తల్లిదండ్రులు సంబరాలకు హాజరయ్యారు.

ఫ రామచంద్రపురానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కె.కృష్ణసాయి ప్రజల్లో మూఢ విశ్వాసాలను తొలగించడం, పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్‌ బీజాలు నాటడం లక్ష్యంగా రేవతి సైన్స్‌ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు.

ఫ కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన వాకా దివ్యశేఖర్‌ భూమి కదలికలపై పరిశోధన చేసి శాసీ్త్రయ విజ్ఞానాన్ని సమాజానికి పంచారు. ముంబయి ఐఐటీలో శాటిలైట్‌ రాడార్‌ చిత్రాలను ఉపయోగించి పరిశోధనను చేశారు. భూకంపాల్లో వచ్చే భూకదలికలు, భూగర్భ జలాల అతి వినియోగం వల్ల భూమి కుంగిపోవడమనే అంశాలపై పలు పరిశోధనా పత్రాలను పబ్లిష్‌ చేశారు.

విస్మరించిన ‘కూటమి’

చంద్రబాబు ప్రభుత్వం శాసీ్త్రయ విద్యను విస్మరిస్తోంది. ఈ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.34,875 కోట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం విద్యకు కేటాయించాలన్న ప్రజా సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ఇబ్బంది ఎదురవుతోంది.

విజ్ఞానంతో మూఢ నమ్మకాలు దూరం

సమాజం అభివృద్ధి పథాన నడవాలంటే సైన్స్‌ ప్రచారమే ఏకై క మార్గం. సైన్స్‌ సంగతులను వివరించడం ద్వారా పెరిగే విజ్ఞానం వల్ల ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలు తొలగిపోతాయి. ఆ దిశగా జిల్లాలో ప్రచారం చేస్తున్నాం. సైన్స్‌ అభివృద్ధికి పాటుపడుతున్నాం.

–శ్రీకృష్ణసాయి,

రేవతి ఫౌండేషన్‌ అధ్యక్షుడు, రామచంద్రపురం

విజ్ఞానంతో ముడిపడి1
1/3

విజ్ఞానంతో ముడిపడి

విజ్ఞానంతో ముడిపడి2
2/3

విజ్ఞానంతో ముడిపడి

విజ్ఞానంతో ముడిపడి3
3/3

విజ్ఞానంతో ముడిపడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement