హుండీల ఆదాయం రూ.2.17 కోట్లు
ఆత్రేయపురం: వాడపల్లిలోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల ద్వారా 35 రోజులకు రూ.2.17 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. శుక్రవారం ఆలయ హుండీలను తెరిచి దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారులు డి.సురేష్‌బాబు, పీవీఎస్ కామేశ్వరరావు, బి.నరేంద్రకుమార్ సమక్షంలో లెక్కించినట్టు తెలిపారు. అలాగే బంగారం 42.400 గ్రాములు, వెండి ఒక కిలో 250 గ్రాములు, 73 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు రాంబాబు, నాగేశ్వరరావు, భవాని, సీహెచ్ సత్యనారాయణ, శిష్ట సూర్య కుటుంబరావు, ఎం.త్రిమూర్తు లు, అర్చకులు, వేద పండితులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.


