బాలాజీకి రూ.2.14 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దర్శనానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. గోవిందా గోవిందా అంటూ బాలబాలాజీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2,14,453 ఆదాయం వచ్చింది. 6,300 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 2,100 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.88,463 విరాళాలుగా అందించారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి, ఈఓ ఎం.రాంబాబురెడ్డి భక్తులకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించారు.


