పేద డొక్కపై ధరవు | - | Sakshi
Sakshi News home page

పేద డొక్కపై ధరవు

Aug 11 2025 6:57 AM | Updated on Aug 11 2025 6:57 AM

పేద డ

పేద డొక్కపై ధరవు

నిత్యవసరాల ధరలు ౖపైపెకి.. పేదల ఇంట్లో ఉడకని పప్పులు

సలసలా కాగుతున్న వంటనూనెలు కందిపప్పు పంపిణీకి సర్కారు మంగళం

రైతుబజార్లలో కనిపించని కౌంటర్లు సామాన్యుడి బతుకు దుర్భరం

ఆలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో నిత్యావసరాల ధరలు రోజుకు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. ధరలు పెరిగినంతగా ఆదాయం పెరగకపోవడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎండీయూ వ్యవస్థను కాదని ఏర్పాటు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు చేరువ కావడం లేదు. బహిరంగ మార్కెట్‌పై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఏడాది వ్యవధిలో నిత్యావసర వస్తువుల ధరలు సుమారు 30 నుంచి 50 శాతం పెరిగిపోయాయి. దీంతో పేదల ఇంట మాంసాహారం తినడం అటుంచితే పప్పులు కూడా ఉడకలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని విపరీతంగా పెంచడంతో వంటనూనె సలసలా కాగుతోంది. సన్నబియ్యం ధరలకు లెక్కలొచ్చాయి. విద్యుత్‌ బిల్లులను చూస్తేనే షాక్‌ కొట్టే విధంగా ఉంటున్నాయి. దళారుల ప్రభావంతో కూరగాయలు పండించిన ఉద్యాన రైతుకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. ఇప్పటికే రేషన్‌ ద్వారా రాయితీతో పంపిణీ చేసే కందిపప్పు మూణ్ణాళ్ల ముచ్చటగా నిలిచిపోయింది. వంటనూనెల ఊసే లేకుండా పోయింది. ధరల నియంత్రణ చేస్తామంటూ ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా రైతుబజార్లలో ఏర్పాటు చేసిన కౌంటర్లు కనిపించకుండా పోయాయి. దీంతో ధరలు పేదలకు భారమవుతున్నాయి. ప్రభుత్వానికి గ్లోబెల్‌ ప్రచారం, కక్ష సాధింపు, ఓట్ల రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ధరల నియంత్రణపై లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కందిపప్పును రాయితీపై అందించలేరా?

సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు రేషన్‌ డిపోల ద్వారా కందిపప్పును రాయితీపై అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. జిల్లాలోని 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 5.48 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా 926 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకూ రేషన్‌ బియ్యం, పంచదారను మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 14 నెలల్లో మూడు నెలల మాత్రమే కందిపప్పు సరఫరా జరిగింది.

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

కేజీ రూ.67 మాత్రమే

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిలో కందిపప్పును రూ.67కే అందించారు. రైతుబజార్లతో సన్న బియ్యం ధర కేజీ రూ.60 లోపు ఉండే విధంగా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రి వర్గం సమీక్షలు నిర్వహించి పేదలపై అదనపు భారం పడకుండా ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసి క్షేత్రస్థాయిలో అధికారులు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కందిపప్పు, బియ్యం, వంటనూనెల ధరలకు రెక్కలొచ్చాయి. కూటమి ప్రభుత్వం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం వల్లే ధరల పెరుగుదలకు కారణమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలపై సమీక్షలు నిర్వహించకపోవడం వల్లే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు వాపోతున్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు

కిలోల్లో (గత ఏడాదితో పోల్చితే)

నిత్యావసరాలు జూన్‌ 2024 ఆగస్టు 2025

(రూ.లలో) (రూ.లలో)

బియ్యం సూపర్‌ ఫైన్‌ 57 69

బియ్యం గ్రేడ్‌–2 35 46

కందిపప్పు 110 130

మినపప్పు 80 115

పెసరపప్పు 90 130

పచ్చి శనగపప్పు 65 90

గోధుమ పిండి 40 60

ఉప్మా నూక 36 50

పంచదార 38 48

బెల్లం 32 60

చింతపండు 80 120

వేరుశనగ గుళ్లు 110 160

పామాయిల్‌ (లీటర్‌) 89 140

సన్‌ఫ్లవర్‌ (లీటర్‌) 102 150

వేరుశనగ నూనె (లీటర్‌) 130 180

పేద డొక్కపై ధరవు1
1/5

పేద డొక్కపై ధరవు

పేద డొక్కపై ధరవు2
2/5

పేద డొక్కపై ధరవు

పేద డొక్కపై ధరవు3
3/5

పేద డొక్కపై ధరవు

పేద డొక్కపై ధరవు4
4/5

పేద డొక్కపై ధరవు

పేద డొక్కపై ధరవు5
5/5

పేద డొక్కపై ధరవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement