హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య | Young Woman Assassinate In Hyderabad Pathabasthi | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో యువతి దారుణ హత్య

Oct 18 2020 5:46 PM | Updated on Oct 18 2020 9:01 PM

Young Woman Assassinate In Hyderabad Pathabasthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించావ్‌.. పెళ్లి చేస్కో అని ప్రియుడి ఇంటికి వెళ్లిన యువతిని సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీ రెయిన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మధీనా నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌కు చెందిన రాధిక, పాతబస్తీకి చెందిన ముస్తాఫా ప్రేమించుకున్నారు. కాగా, శనివారం రాత్రి ప్రియుడి ఇంటికి వెళ్లిన రాధిక.. ప్రేమించావు పెళ్లి చేస్కో అని ముస్తాఫాను నిలదీశారు.

ఈ క్రమంలో ముస్తాఫా కుటుంబ సభ్యులకు, రాధికకి మధ్య గొడవ జరిగింది. అర్థరాత్రి తర్వాత ముస్తాఫా, అతని సోదరుడు జమిల్‌ కలిసి రాధికని దారుణంగా హత్య చేశారు. కత్తితో యువతిని పొడిచి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులకు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అనంతరం నారాయణ ఖేడ్‌కు పంపిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement